Gautam Gambhir: క్రికెట్ ఎవరి జాగీరు కాదు.. మాజీ క్రికెటర్లకు గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్.. టార్గెట్ వాళ్లేనా..

Gautam Gambhir: క్రికెట్ ఎవరి జాగీరు కాదు.. మాజీ క్రికెటర్లకు గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్.. టార్గెట్ వాళ్లేనా..

టీమిండియా హెడ్ కోచ్ గా గంభీర్ వచ్చినప్పటి నుండి భారత్ ఊహించని పరాజయాలు ఎదుర్కొంటుంది. ద్రవిడ్ హెడ్ పదవికి రాజీనామా చేసిన తర్వాత బీసీసీఐ గౌతమ్ గంభీర్ ను ప్రధాన కోచ్ గా నియమించింది. అనుభవం లేకోపోయినా బీసీసీఐ గంభీర్ ను గుడ్డిగా నమ్మినట్టు స్పష్టంగా తెలుస్తుంది. ప్రధాన కోచ్ గా గంభీర్ కు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. అతనికి నచ్చినట సహాయక కోచ్ లను నియమించింది. అయితే మూడు నెలలు గడిచేసరికి గంభీర్ కు అన్ని చేదు అనుభవాలే.

శ్రీలంకపై వన్డే సిరీస్ ను 0-2తో భారత జట్టు కోల్పోయింది. 28 ఏళ్ళ  తర్వాత భారత గడ్డపై లంక సిరీస్ గెలుచుకొని సంచలనం సృష్టించింది. ఒకరకంగా చెప్పాలంటే శ్రీలంక-బి జట్టుతో ఓడిపోయింది. తాజాగా స్వదేశంలో న్యూజిలాండ్ మూడు టెస్టుల సిరీస్ 0-3 తేడాతో వైట్ వాష్ అయింది. దీంతో గంభీర్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆస్ట్రేలియాలో ఇటీవలే ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కూడా 1-3 తేడాతో ఓడిపోయింది. దీంతో బీసీసీఐ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత గంభీర్ ను సాగనంపే ప్రయత్నాలు చేసింది. 

గంభీర్ కోచ్ గా భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకోవడంతో గంభీర్ తన కోచింగ్ పదవిలో కొనసాగుతున్నాడు. ప్రారంభంలో గంభీర్ కోచింగ్ పై చాలానే విమర్శలు వచ్చాయి. తనను ఎవరు విమర్శించారో గుర్తు పెట్టుకొని మరీ పరోక్షంగా వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. కోచింగ్ పదవీకాలం యొక్క ప్రారంభ రోజుల గురించి మాట్లాడుతూ గంభీర్ ఇలా అన్నాడు.. “నేను ఈ ఉద్యోగాన్ని చేపట్టినప్పుడు, ఎల్లప్పుడూ హెచ్చు తగ్గులు ఉంటాయని నాకు తెలుసు. ఏసీ కామెంటరీ బాక్స్‌లలో కూర్చున్న కొంతమంది వ్యక్తులను సంతృప్తి పరచడానికి నేను ఇక్కడ లేను. దేశాన్ని గర్వపడేలా చేయడమే నా పని.” అని గంభీర్ ఆయన ABP ఇండియా ఎట్ 2047 సమ్మిట్‌లో అన్నారు. 

ఈ సందర్భంగా భారత క్రికెట్‌ను కొంతమంది మాజీ ఆటగాళ్లు తమ వ్యక్తిగత డొమైన్‌గా భావిస్తారని మాజీ క్రికెటర్లపై విరుచుకుపడ్డాడు. 25 సంవత్సరాలుగా కామెంటరీ బాక్స్‌లో కూర్చున్న కొంతమంది భారత క్రికెట్‌ను తమ కుటుంబ ఆస్తిగా భావిస్తారని.. ఇది ఇండియా మొత్తానికి సంబంధించిందని మాజీ క్రికెటర్లపై సెటైర్ వేశాడు. నాకు చేయాల్సిన అవసరం లేదని.. దేశం కోసం మంచి జట్టును నిర్మించడమే తన బాధ్యత అని ఈ సందర్భంగా గంభీర్ తెలిపాడు. సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, హర్ష భోగ్లే కామెంట్రీపై గంభీర్ ఈ కామెంట్స్ చేసినట్టు తెలుస్తుంది.