రాజీవ్ వర్మ, మలైకా టి. వాసుపాల్ జంటగా గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో కనుమూరి ప్రసాద్ రాజు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆదివారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు షాట్‌కు ఆస్కార్ విన్నింగ్ లిరిసిస్ట్ చంద్రబోస్ క్లాప్ కొట్టగా, నిర్మాత కనుమూరి ప్రసాద్ రాజు కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ‘ఇదొక ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ప్రేమ కథ.
హైదరాబాద్‌లో ఈ నెల 12 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి నాలుగు షెడ్యూల్స్‌లో సినిమా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాం. ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తాం’ అని చెప్పారు. అజయ్ ఘోష్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, జెమిని సురేష్, రమణ భార్గవ్, శివాజీ రాజా, ఆయూషి కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఆర్‌కే సేనాపతి సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు.
