
దుబాయ్: టీ20 కొత్త కెప్టెన్ విషయంలో సునీల్ గావస్కర్ మళ్లీ మాట మార్చాడు. జట్టు ఫ్యూచర్ దృష్ట్యా కేఎల్ రాహుల్‌ను నాయకుడిగా నియమించాలన్న సన్నీ ఇప్పుడు రోహిత్‌కు పగ్గాలు అప్పగించాలని చెబుతున్నాడు. రాబోయే రెండు వరల్డ్‌కప్స్‌కు హిట్‌మ్యాన్‌ను సారథిగా చేయాలని సూచించాడు. వైట్‌బాల్ టీమ్స్‌కు 2017 నుంచి రోహిత్.. వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. ‘ఏడాది గ్యాప్‌లో రెండు టీ20 వరల్డ్‌కప్స్ ఉన్నాయి. కాబట్టి ఈ స్టేజ్‌లో కెప్టెన్లను మార్చడం కరెక్ట్ కాదు. అందుకే నా చాయిస్ రోహిత్’ అని సన్నీ వ్యాఖ్యానించాడు.