జీడీపీ గ్రోత్​రేట్  6.3 శాతానికి తగ్గింపు : వరల్డ్​ బ్యాంక్ ​

జీడీపీ గ్రోత్​రేట్  6.3 శాతానికి తగ్గింపు : వరల్డ్​ బ్యాంక్ ​

న్యూఢిల్లీ:  గ్లోబల్​ మార్కెట్లలో ఇబ్బందులు, దేశంలో  డిమాండ్​తగ్గడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇండియా జీడీపీ గ్రోత్​ను 6.6శాతం (డిసెంబర్ అంచనా ) నుంచి 6.3శాతానికి వరల్డ్​ బ్యాంక్ ​తగ్గించింది. అప్పుల భారం ఎక్కువ కావడం, రాబడులు తగ్గడం వల్ల ప్రైవేట్​ కన్సంప్షన్​ పెరుగుదలకు ఆటంకాలు ఎదురవుతాయని తెలిపింది.

కరోనా సమయంలో ప్రారంభించిన పథకాలను నిలిపివేస్తున్నందున ప్రభుత్వ ఖర్చులూ తగ్గుతాయని అంచనా వేసింది. 2024 ఆర్థిక సంవత్సరానికి ఇండియా జీడీపీ గ్రోత్​ 6.4 శాతం వరకు ఉండొచ్చని ఆర్​బీఐ ప్రకటించింది.  కేంద్రం అంచనాల ప్రకారం.. ఇండియా 2023లో ఏడుశాతం గ్రోత్ ​సాధిస్తుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్​ కన్సంప్షన్​ గ్రోత్​ 8.3 శాతం ఉండగా, 2024 లో ఇది 6.9శాతానికి తగ్గవచ్చు.