
హైదరాబాద్, వెలుగు: గ్లోబల్ఎడ్యుకేషన్ (జీఈడీయూ) సంస్థ హైదరాబాద్‌లో జరిగిన స్కిల్లర్ స్పాట్‌లైట్ ఈవెంట్ సందర్భంగా తన లక్ష్యాలను ప్రకటించింది. ఇక నుంచి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ (స్టెమ్) విద్యపై దృష్టి సారిస్తామని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా మంచి ఉద్యోగాలను పొందడానికి, భవిష్యత్ అవసరాలకు సిద్ధంగా ఉండటానికి స్టెమ్ విద్య చాలా ముఖ్యమని ప్రకటించింది.
నాణ్యమైన స్టెమ్ విద్యను అందించడం ద్వారా విద్యార్థులను గ్లోబల్ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దుతామని తెలిపింది. ఈ సందర్భంగా జరిగిన ఈ స్కిల్లర్ స్పాట్‌లైట్ ఈవెంట్‌లో, విద్యార్థులకు, విద్యావేత్తలకు స్టెమ్ రంగంలో ఉన్న అవకాశాలు, భవిష్యత్ డిమాండ్ గురించి వివరించింది. జీఈడియూ తమ గ్లోబల్ యూనివర్సిటీ నెట్‌వర్క్ ద్వారా అందించే విద్యా విధానాలను కూడా ప్రదర్శించింది.