గీత కార్మికుల బకాయిలు రిలీజ్ చేయాలి .. తెలంగాణ రాష్ట్ర గీత పనివారల సంఘం డిమాండ్

గీత కార్మికుల బకాయిలు రిలీజ్ చేయాలి .. తెలంగాణ రాష్ట్ర గీత పనివారల సంఘం డిమాండ్

బషీర్​బాగ్​, వెలుగు: ప్రమాదవశాత్తు తాటిచెట్టుపైనుంచి పడి చనిపోయిన గీత కార్మికుల కుటుంబాలకు రావాల్సిన రూ.13 కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర గీత పనివారల సంఘం అధ్యక్షుడు బొమ్మగాని ప్రభాకర్ డిమాండ్​ చేశారు. గీత కార్మికుల  సమస్యల  పరిష్కారం కోసం ఈ నెల 22న బషీర్​బాగ్​లో రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన కర పత్రాన్ని హిమాయత్ నగర్ బ‌హ‌దూర్ గౌర్ హాల్ లో ఆదివారం ఆయన ఆవిష్కరించారు. స్వాతంత్య్ర సమరయోథుడు, మాజీ ఎంపీ బొమ్మగాని ధర్మభిక్షంగౌడ్​ కాంస్య విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.జి.సాయిలు గౌడ్, రాష్ట్ర సమన్వయ కార్యదర్శి బి.నాగభూషణం, రాష్ట్ర కార్యదర్శి మారగోని ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.