భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రి జిల్లా కొత్తగూడెం సిటీలో ఆదివారం నిర్వహించిన సింగరేణి మెగా జాబ్ మేళాకు స్పందన వచ్చింది. ఇదే ప్రోగ్రాంలో సింగరేణిలో ఎంప్లాయిమెంట్ పొందిన డిపెండెంట్లు 370 మంది డిపెండెంట్లకు నియామకపు పత్రాలను అందజేశారు. కొత్తగూడెం క్లబ్లో ఏర్పాటు చేసిన మెగా జాబ్‌మేళాను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, డైరెక్టర్పా గౌతం పొట్రు, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ బి.రోహిత్ రాజుతో కలిసి సీఎండీ ప్రారంభించారు. జాబ్ మేళాకు ఆరు వేలకు పైగా నిరుద్యోగులు తరలివచ్చారు. దాదాపు మూడు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సింగరేణి అధికారులు కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎండీ బలరాం మాట్లాడుతూ గత పదేండ్లలో కొత్త బొగ్గు బ్లాకులను తెచ్చుకోలేకపోయామన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో కొత్త బొగ్గు బ్లాకుల కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. సింగరేణి ఆధ్వర్యంలో పలు చోట్ల మెగా జాబ్ మేళాలను నిర్వహిస్తూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామన్నారు. మరో ఆరు నెలల్లో ఇంకో ఆరు వందల మందికి కారుణ్య నియామకాల్లో భాగంగా ఉద్యోగ నియామకపు పత్రాలను ఇవ్వనున్నట్టు తెలిపారు. సింగరేణి ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహించనున్నట్టు తెలిపారు. మన కాలనీలు,రోడ్లు, షాపింగ్ కాంప్లెక్స్ పాడు బడినట్టుగా ఉంటాయని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి ప్రాంతాల్లో కొత్త క్వార్టర్లు, షాపింగ్‌కాంప్లెక్స్, రోడ్లు నిర్మించాలన్నారు.
పాల్వంచలో 800మెగావాట్ల విద్యుత్‌ప్లాంట్లు రెండింటి కోసం కృషి చేస్తున్నానని తెలిపారు. ఈ ప్రోగ్రాంలో సింగరేణి డైరెక్టర్లు కొప్పుల వెంకటేశ్వర్లు, తిరుమలరావు, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ నేతలు వాసిరెడ్డి సీతారామయ్య, కె. రాజ్ కుమార్, మిర్యాల రంగయ్య, త్యాగరాజన్, వంగా వెంకట్, మల్లికార్జున్, రమణమూర్తి, కొత్తగూడెం ఏరియా జీఎం షాలెం రాజు, జీఎం వెల్ఫేర్ కిరణ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పి. వీరబాబు, సీఎంఓఏఐ ప్రెసిడెంట్లక్ష్మీపతిగౌడ్, ఎస్వోటూజీఎం కోటి రెడ్డి పాల్గొన్నారు.
