అమ్మాయిగా మారమన్నడు.. మారాక హ్యాండిచ్చిండు!

అమ్మాయిగా మారమన్నడు..  మారాక హ్యాండిచ్చిండు!

సూర్యాపేట, వెలుగు: వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. అన్ని లవ్​స్టోరీల్లాగే వాళ్ల పెళ్లికీ ఆటంకాలు ఎదురయ్యాయి. పెద్దలు వద్దన్నారు. అయినా పట్టు వదల్లేదు. ఇది మీరనుకుంటున్నట్టు అబ్బాయి, అమ్మాయి ప్రేమ కాదు. అబ్బాయి అబ్బాయి ప్రేమకథ. సింపుల్​గా చెప్పాలంటే గే లవ్​ స్టోరీ. కానీ, కథ ఇక్కడే మలుపు తిరిగింది. అమ్మాయిగా మారితేనే పెళ్లి చేసుకుంటానని ఓ అబ్బాయి షరతు పెట్టాడు. దీంతో ఇంకో అబ్బాయి తాను కోరుకున్నవాడి కోసం లింగ మార్పిడి చేయించుకున్నాడు. తీరా చేయించుకున్నాక ఆ షరతు పెట్టిన అబ్బాయి హ్యాండిచ్చాడు. దీంతో అమ్మాయిగా మారిన అబ్బాయి పోలీసుల దగ్గరకు వెళ్లాడు. తనను పెళ్లి చేసుకోవాల్సిందేనని డిమాండ్​ చేస్తున్నాడు. ఈ గే లవ్​ స్టోరీ సూర్యాపేట జిల్లా ఇమాంపేటలో జరిగింది.