జియో సరికొత్త రీచార్జ్ ప్లాన్..తక్కువ ఖర్చుతో.. డేటా లేకుండా365 రోజుల వ్యాలిడిటీ

జియో సరికొత్త రీచార్జ్ ప్లాన్..తక్కువ ఖర్చుతో.. డేటా లేకుండా365 రోజుల వ్యాలిడిటీ

టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ ను ప్రకటించింది. ఇకపై అన్ని ప్రైవేట్ టెలికం కంపెనీలు కాలింగ్, SMS లతో మాత్రమే రీచార్జ్ ప్లాన్లను అందించాలని ఆదేశించింది. డేటా వినియోగించని కస్టమర్లకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపింది. అందులో భాగంగా అన్ని టెలికం కంపెనీలు డేటా లేకుండా కేవలం కాలింగ్, SMS లను అందించే ప్లాన్లను ప్రారంభిస్తున్నాయి. తాజాగా  ప్రముఖ ప్రైవేట్ టెలికం కంపెనీ అయిన జియో రెండు  కొత్త రీచార్జ్ ప్లాన్లను ప్రకటించింది. 

రిలయన్ష్ జియో డేటా లేకుండా రీచార్జ్ ప్లాన్ ను ప్రవేశపెట్టింది. ఇది 365 రోజలు వ్యాలిడిటీని అందిస్తుంది. జియో తన వెబ్‌సైట్‌లో రెండు కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్లను ఉంచింది. దీనిలో కస్టమర్లు 365 రోజుల వరకు దీర్ఘకాలిక వ్యాలిడిటీని పొందుతారు. డేటాను ఉపయోగించని కస్టమర్లకు ఈ ప్లాన్ బెస్ట్ వన్. 

జియో అందిస్తున్న డేటా లేని రెండు రీచార్జ్ ప్లాను.. 1) రూ. 458 ప్లాన్.. ఇది 84 రోజులు వ్యాలిడిటీని అందిస్తుంది. 2) రూ. 1958 రీచార్జ్ ప్లాన్.. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లు 365 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ రీచార్జ్ ప్లాన్ల పూర్తి వివరాలు తెలుసుకుందాం.. 

84 రోజుల జియో రీచార్జ్ ప్లాన్

జియో కొత్త రూ.458 ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. ఈ ప్లాన్ లో యూజర్లకు అన్ లిమిటెడ్ కాల్స్, 1000 ఉచిత SMS లు లభిస్తాయి. దీంతోపాటు జియో సినిమా,జియో టీవీ వంటి యాప్ లకు కూడా ఉచిత యాక్సెస్ ఉంటుంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా కాలింగ్ ,SMS మాత్రమే ఉపయోగించే కస్టమర్లకోసం తీసుకొచ్చారు. ఈ ప్లాన్ లో  భారతదేశం అంతటా ఏ నెట్‌వర్క్‌లోనైనా అపరిమిత కాల్స్ ,ఉచిత నేషనల్ రోమింగ్ సౌకర్యం ఉంటుంది. 

జియో 365 రోజుల రీచార్జ్ ప్లాన్

జియో కొత్త రూ.1958 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా 365 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ ప్లాన్‌లో కస్టమర్లు భారతదేశం అంతటా ఏ నెట్‌వర్క్‌లోనైనా అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. దీంతోపాటు 3600 ఉచిత SMS లు, ఫ్రీ నేషనల్ రోమింగ్ కూడా లభిస్తుంది. ఈ ప్లాన్ Jio సినిమా,జియో టీవీ వంటి యాప్‌లకు ఉచిత యాక్సెస్‌ను కూడా అందిస్తుంది. కస్టమర్లు పూర్తిస్థాయిలో వినోదాన్ని పూర్తిగా ఆస్వాదించవచ్చు.

రెండు పాత ప్లాన్లను తొలగించిన జియో

జియో ఇప్పుడు తన పాత రీఛార్జ్ ప్లాన్లలో కొన్నింటిని తొలగించింది. ఈ ప్లాన్‌లు రూ.479 రీచార్జ్ ప్లాన్, రూ.1899 రీచార్జ్ ప్లాన్ రూ.1899 ప్లాన్లను తొలగించింది.. ఇవి 336 రోజుల వ్యాలిడిటీతో 24GB డేటాను అందిస్తుండగా రూ.479 ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో 6GB డేటాను అందించింది.