V6 News

నెట్‌ఫ్లిక్స్‌ కొత్త ఫీచర్.. ఇప్పుడు టిక్ టాక్, రీల్స్ లాంటి షార్ట్ వీడియోలు చూడొచ్చు..

నెట్‌ఫ్లిక్స్‌ కొత్త ఫీచర్.. ఇప్పుడు టిక్ టాక్, రీల్స్ లాంటి  షార్ట్ వీడియోలు చూడొచ్చు..

ప్రముఖ ఒటిటి స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫార్మ్  నెట్‌ఫ్లిక్స్ (Netflix) మొబైల్ యూజర్ల కోసం ఒక కొత్త ఫీచర్‌ టెస్ట్ చేస్తోంది. ఈ కొత్త ఫీచర్ ఏంటంటే ఇప్పుడు మీ స్మార్ట్‌ఫోన్లలో స్క్రోల్ చేస్తూ షోలు, సినిమాల చిన్న చిన్న వీడియో క్లిప్‌లు చూడవచ్చు. ఒక విధంగా ఈ ఫీచర్  ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లేదా టిక్‌టాక్‌లో వీడియోల్లాగే ఉంటుంది.

అయితే ఈ వీడియోస్లో నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ కంటెంట్‌ క్లిప్స్,  ఇంట్రెస్టింగ్  సినిమాల వీడియోస్ చిన్న క్లిప్‌లుగా చూపిస్తుంది. యూజర్లు వాటిని  స్క్రోల్ చేస్తూ చూడొచ్చు. ఏదైనా ఒక క్లిప్ నచ్చితే ఆ షో లేదా సినిమా మొత్తం చూడొచ్చు.  సాధారణంగా చాల మంది నెట్‌ఫ్లిక్స్‌లో ఏం చూడాలో తెలియక చాలా టైం తీసుకుంటారు. ఆ టైం తగ్గించడమే ఈ ఫీచర్ ఉద్దేశం. వేరే యాప్‌లలో ట్రైలర్లు చూసే బదులు నెట్‌ఫ్లిక్స్ యాప్‌లోనే  ట్రైలర్ లాంటి క్లిప్‌లను చూడొచ్చు. 

నెట్‌ఫ్లిక్స్ అధికారి (CTO) ఎలిజబెత్ స్టోన్ మాట్లాడుతూ ఈ ఫీచర్ ద్వారా టిక్‌టాక్ ని కాపీ చేయడం లేదని స్పష్టం చేశారు. మా ఆలోచన మొత్తం యూజర్లకు అందించే కంటెంట్‌ సులభంగా పరిచయం చేయడంపైనే ఉందని చెప్పారు. ఇక్కడ కనిపించే కంటెంట్ యూజర్స్ సొంతంగా క్రియేట్ (User-Generated) చేసిన వీడియోలు కాదని, నెట్‌ఫ్లిక్స్‌లో ఇప్పటికే ఉన్న  సొంత షోలు, సినిమాల నుండి తీసుకున్న అఫీషియల్ క్లిప్‌లు మాత్రమే ఉంటాయని తెమిలింది. ఈ ఫీచర్ నెట్‌ఫ్లిక్స్ యాప్ లో  సినిమాలు/షోలు/ వెబ్ సిరీస్ కోసం బ్రౌజ్ చేసేటప్పుడు యూజర్లు యాప్ నుండి బయటికి వెళ్లకుండా  ఎక్కువ సమయం నెట్‌ఫ్లిక్స్‌లోనే ఉండేలా చేస్తుంది అన్నారు.  

ఇంకా బయటి మార్కెటింగ్ అవసరం లేకుండా, యాప్‌లోనే షోలు/సినిమాల గురించి  ప్రచారం చేసుకునేందుకు   ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఇంకా టెస్టింగ్  దశలోనే ఉంది. 2026 నాటికి మరిన్ని పరీక్షలు జరిగాక, దీన్ని అందరికీ అందుబాటులోకి తేవాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటామని  తెలిపారు.