
BSNL కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఇకపై నెట్ వర్క్ ఇబ్బందులు తప్పినట్లే. ప్రభుత్వరంగంలోని ఈ టెలికం ఆపరేటర్.. స్వదేశీ పరిజ్ణానాన్ని ఉపయోగించి BSN L నెట్ వర్క్ స్పీడ్ పెంచేందుకు 4G టవర్లను ఏర్పాటు చేస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో 4G మొబైల్ నెట్ వర్క్ టవర్లను ఏర్పాటు చేసింది.
గతేడాది జులై లో ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు Jio, Airtel, vodafone Idea సంస్థలు భారీగా మొబైల్ రీచార్జ్ ధరలు పెంచాయి. దీంతో లక్షల్లో యూజర్లు BSNL వైపు మొగ్గు చూపారు. భారీగా BSNL సబ్ స్క్రిప్షన్ తీసుకున్నారు. అయితే నెట్ వర్క, స్లో ఇంటర్నెట్, కాల్ డ్రాప్ వంటి సమస్యలతో యూజర్లు నిరాశ చెంది సబ్ స్క్రిప్షన్ రద్దు చేసుకున్నారు. ఈ క్రమంలో BSNL తన నెట్ వర్క్ సేవలను మెరుగుపర్చడంపై దృష్టి సారించింది.
నెట్ వర్క్ విస్తరణలో భాగంగా దేశవ్యాప్తంగా లక్ష టవర్ల ఏర్పాటు ను లక్ష్యంగా పెట్టుకుంది.. అనుకున్నట్లుగానే 84వేల 4G టవర్లను ఇన్ స్టాల్ చేసింది.. మిగిలినవి పూర్తిచేసి 5G సేవలను అప్ గ్రేడ్ చేసి కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తే. కస్టమర్లకు BSNL మెరుగైన నెట్ వర్క్ అందించడం ద్వారా ప్రైవేట్ టెలికం ఆపరేటర్లకు గట్టిపోటీ ఇవ్వాలని యోచిస్తోంది.
త్వరలో BSNL 5G లాంచ్..!
రిపోర్టుల ప్రకారం.. 4G టవర్ల ఇన్ స్టాలేషన్ పూర్తియిన వెంటనే BSNL తన 5G సేవలను ప్రారంభించేందుకు సిద్దంగా ఉంది. 2025 జూన్ నాటికి దేశవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో 5సేవలను ప్రారంభించనుంది. ఇప్పటికే ప్రధాన నగరాల్లో జియో, ఎయిర్ టెల్ వంటి ప్రైవేట్ టెలికా ఆపరేటర్లతో పోటీ పడుతూ 5G సేవలందిస్తోంది.
మాతృ దినోత్సవ ప్రత్యేక ఆఫర్లు
BSNL తన నెట్ వర్క్ మెరుగు పర్చుకోవడమే కాదు.. ఆఫర్ల ద్వారా కూడా ఉన్న కస్టమర్లను కాపాడుకోవడం, కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా మదర్ప్ డే సందర్శంగా BSNL కస్టమర్లకోసం ప్రత్యేక ఆఫర్లు ప్రకటిచింది. మే 7 నుంచి 14 తేదీల మధ్య స్పెషల్ రీచార్జ్ ఆఫర్లను అందిస్తోంది.
రూ.1499 , రూ.1999 ప్రీపెయిడ్ ప్లాన్‌లపై అదనపు వ్యాలిడిటీని అందిస్తోంది. ఎంచుకున్న మూడు ప్లాన్లపై 5 శాతం తగ్గింపు ఇస్తుంది.
రూ.1499 ప్లాన్ లో 336 రోజులు వ్యాలిడిటీ ఉండగా కస్టమర్లు అదనంగా మరో 29 రోజులు అనగా 365 రోజుల వ్యాలిడిలీని పొందవచ్చు. అదేవిధంగా రూ.1999 ప్లాన్ ఇప్పుడు 365 రోజుల నుంచి 380 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ఆఫర్ పొందేందుకు కస్టమర్లు BSNL వెబ్‌సైట్ లేదా DoT యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకోవాలి.
దేశవ్యాప్తంగా నెట్ వర్క్ టవర్ల ఏర్పాటు, ఆకర్షణీయమైన ఆఫర్లతో BSNL తన కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఇంకా మెరుగైన సేవలు అందించి మార్కెట్లో తన స్థానాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తోంది.