ఇస్రో బాహుబలి రాకెట్ ప్రయోగం సక్సెస్ అయ్యింది.. అంతరిక్షంలోకి దూసుకెళ్లిన బ్లూబర్డ్ ఉపగ్రహం ఇక పని ప్రారంభించబోతున్నది. ఈ బ్లూబర్డ్ ఉపగ్రహం వల్ల మనకు ఏంటీ లాభం.. మనకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి.. ఈ ఉపగ్రహాన్ని మనం ఎలా ఉపయోగించుకోబోతున్నాం అనేది తెలిస్తే మాత్రం అవాక్కవుతారు. అవును.. ఇక నుంచి మనకు నెట్ వర్క్ ఇష్యూలే ఉండవు.. మన స్మార్ట్ ఫోన్.. ఇక శాటిలైన్ ఫోన్ కాబోతున్నది.. అవును ఇది నిజం.. ఇస్రో ప్రయోగించిన బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో వివరంగా తెలుసుకుందామా..
ALSO READ : ISRO..బ్లూబర్డ్ బ్లాక్-2 మిషన్..
బ్లూబర్డ్ 2 ఎందుకు ప్రత్యేకమైనది :
>>> మన స్మార్ట్ ఫోన్ ను శాటిలైట్ కు లింక్ చేసుకోవచ్చు. నెట్ వర్క్ ఇష్యూలే ఉండవు.
>>> ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా.. నెట్ వర్క్ కోసం తంటాలు పడాల్సిన అవసరం లేదు.
>>> 4జీ.. 5జీ కనెక్టివిటీతో.. వాయిస్, వీడియో కాల్స్ ను హై స్పీడ్ డేటా నెట్ వర్క్ తో కనెక్ట్ చేసుకోవచ్చు.
>>> మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఆడియో, వీడియోనే కాదు.. లైవ్ స్ట్రీమింగ్, లైవ్ మెసేజింగ్ డేటా సేవలను శాటిలైట్ ద్వారా పంపించుకోవచ్చు.
>>> అంతరిక్షం నుంచి భూమిపైకి నేరుగా మాట్లాడుకోవచ్చు. అంతరిక్షంలోకి వెళ్లే యోమగాములకు ఇది ఎంతో ఉపయోగం.
>>> బ్లూబర్డ్ బ్లాక్ -2 శాటిలైట్ ద్వారా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్మార్ట్‌ఫోన్‌లకు నేరుగా హై-స్పీడ్ సెల్యులార్ బ్రాడ్‌బ్యాండ్‌ను అందిస్తుంది.
>>> ఈ ఉపగ్రహం 223 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న భారీ యాంటెన్నాను కలిగి ఉంది. ఈ శాటిలైట్ దిగువ భూ కక్ష్యలో తిరిగే అతిపెద్ద వాణిజ్య కమ్యూనికేషన్ ఉపగ్రహం.
>>> బ్లూ బర్డ్ బ్లాక్-2 శాటిలైట్.. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ అనే కంపెనీకి చెందినది.
>>> ఇది ఆ కంపెనీకి చెందిన 6వ శాటిలైట్
2024 సెప్టెంబర్ లో ఇప్పటికే కంపెనీ 5 బ్లూబర్డ్ శాటిలైట్స్ ను లాంచ్ చేసింది.
