జనరల్ బాడీ మీటింగ్ లో మహిళా సర్పంచుల ఆవేదన

జనరల్ బాడీ మీటింగ్ లో మహిళా సర్పంచుల ఆవేదన

వరంగల్ అర్బన్ జిల్లా: పర్వతగిరి జనరల్ బాడీ మీటింగ్ లో జమాల్ పురం, చౌటపల్లి మహిళ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. ఊళ్లో లంచాలు ఇవ్వందే పని జరగడం లేదన్నారు. లంచాలు లంచాలు అంటున్నారనీ... ఎంపీఓకు ... ఉప సర్పంచ్ కి..  వార్డ్ మెంబర్ లకి... ఎక్కడ తెచ్చి లంచం ఇవ్వాలని మహిళా సర్పంచ్ లు ఆవేదనగా చెప్పారు. ఊళ్లో తాము పనులు ఎలా చేయాలని... తెచ్చిన బాకీలు ఎలా కట్టాలని ప్రశ్నించారు. పర్వతగిరి జనరల్ బాడీ మీటింగ్ లో ఎంపీపీ కమల, జెడ్పిటిసి సింగ్ లాల్, స్థానిక ఆఫీసర్లు, ప్రజాప్రతినిధుల దగ్గర బాధను చెప్పుకున్నారు సర్పంచ్ లు