OMG : హాలీవుడ్ హీరో జానీని కాల్చి చంపారు..

OMG : హాలీవుడ్ హీరో జానీని కాల్చి చంపారు..

హాలీవుడ్ లో వచ్చే ప్రముఖ సీరియల్ జనరల్ హాస్పటల్.. ఈ సీరియల్ లో హీరో పాత్రలో నటిస్తున్న 37 ఏళ్ల జానీ వాక్టర్ ను కాల్చి చంపారు దుండగులు.. లాస్ ఏంజెల్స్ లో 2024, మే 26వ తేదీ అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. హాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం షాక్ అయ్యింది. జానీ వాక్టర్ ను కాల్చి చంపటానికి కారణాలు ఏంటీ.. ఇది ఎలా జరిగింది.. ఎందుకు జరిగింది అనేది ఆసక్తికరంగా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే, లాస్  ఏంజెల్స్ లో తెల్లవారుజామున 3గంటల సమయంలో జానీ ఒక రూఫ్ టాప్ బార్లో పని ముగించుకొని తన కొలీగ్ తో కలిసి వస్తుండగా, జానీ కార్ క్యాటలిటిక్ కన్వర్దర్ ను దొంగిలించేందుకు యత్నిస్తున్న ముగ్గురు ఆగంతకులను గమనించాడు. వారిని అడ్డుకోబోయిన జానీని ముగ్గురు అగంతకుల్లో ఒకడు జానీపై కాల్పులు జరిపాడని తెలుస్తోంది.

ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని కాల్పుల్లో గాయపడ్డ జానీని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. జానీ మృతి పట్ల తన సహా నటులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. జానీ మంచి నటుడు మాత్రమే కాదని, హార్డ్ వర్కర్ అని అంటున్నారు. జానీ నిజాయితీపరుడు ధైర్యవంతుడు అని తన సహా నటులు జానీతో తమకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.