అయోధ్యకు సాధారణ భక్తులు ఎప్పుడు వెళ్లొచ్చు?

అయోధ్యకు సాధారణ భక్తులు ఎప్పుడు వెళ్లొచ్చు?

అయోధ్యలో మరికొన్ని గంటల్లో  బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది.  సరిగ్గా మధ్యాహ్నం 12.05 గంటలకు బాలరామచంద్రుడి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం జరగనుంది.  ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగే ఈ కార్యక్రమానికి 4 వేలమంది ప్రముఖులు హాజరుకానున్నారు.  ఇప్పటికే  శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారికి ఆహ్వానాలు పంపించింది.  రామమందిర నిర్మాణం పూర్తయ్యాకే సాధారణ భక్తులకు అనుమతి ఇస్తారంటూ ప్రచారం జరగగా దీనిపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ స్పందిస్తూ వాటిని కొట్టివేసింది.  

రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయిన మరుసటి రోజు నుంచే అంటే జనవరి 23 నుంచే సాధారణ భక్తులకు రామడి దర్శానానికి అనుమతి ఉంటుందని  తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.  ఆలయ నిర్మాణ పనులు జరుగుతాయని తెలిపారు.  ఆలయాన్ని ఉదయం 7 గంటల నుంచి 11 : 30 గంటల వరకు..  మధ్యా్హ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తెరిచి ఉంచనున్నారు.  పండుగల సమయాలలో టైమింగ్స్ మారవచ్చు.  నిత్యం మూడుసార్లు ప్రత్యేక హారతి ఇస్తారు.  ఆలయ ప్రారంభోత్సవం తర్వాత ప్రతిరోజూ మూడు నుండి ఐదు లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారని అంచనా వేస్తున్నారు.  

భక్తులందరికీ అయోధ్య రామమందిరంలోకి ప్రవేశం ఉచితం. అయితే ప్రత్యేక దర్శనం చేసుకోవాలనుకునే భక్తులకు ప్రత్యేక దర్శన టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను కొనుగోలుచేయాల్సి ఉంటుంది.  ఆలయ టిక్కెట్ ధర ఒక్కొక్కరికి రూ.100 నుంచి రూ.300 వరకు ఉంటుంది.   శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం ఇంకా  దర్శనం టిక్కెట్లను విడుదల చేయలేదు. భక్తులందరికీ ఉచిత ప్రసాదం కూడా ఉంటుంది