
న్యూఢిల్లీ: ప్రభుత్వం కార్పొరేట్ లాబీల ఒత్తిడి వలన జన్యు మార్పిడి చేసిన రెండు వరి రకాలను విడుదల చేసిందని జీఎం-–ఫ్రీ ఇండియా కోలిషన్ సోమవారం విమర్శించింది. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) అభివృద్ధి చేసిన మొదటి జన్యు మార్పిడి వరి రకాలు - డీఆర్ఆర్ ధాన్ 100 (కమలా), పూసా డీఎస్‌టీ రైస్ 1ను ఆదివారం విడుదల చేశారు.
ఈ రకాలు వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొని, వరి దిగుబడిని 30 శాతం వరకు పెంచుతాయని అంచనా. "కార్పొరేట్ లాబీల ఒత్తిడితో ప్రభుత్వం చట్టవిరుద్ధమైన పనులు చేయడం షాకింగ్‌గా ఉంది. జన్యు సవరణ టెక్నిక్‌లు సేఫ్ కాదని చాలా సైంటిఫిక్ రిపోర్ట్‌లు చెబుతున్నాయి" అని కోలిషన్ ఒక స్టేట్‌మెంట్‌లో తెలిపింది. ఈ జన్యు మార్పిడి రైస్ రకాలు భారత్‌లోని వైవిధ్యమైన వరి జన్యు సమూహాన్ని ప్రమాదంలోకి నెట్టవచ్చని ఈ గ్రూప్ హెచ్చరించింది. జన్యు మార్పిడి మంచిది కాదని తెలిపింది.