
సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka shetty), యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి(Naveen polishetty) ప్రధాన పాత్రల్లో వచ్చిన లేటెస్ట్ మూవీ Miss. శెట్టి Mr. పొలిశెట్టి. కొత్త దర్శకుడు మహేష్ బాబు తెరకెక్కించిన ఈ మూవీ సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అవుట్ అండ్ అవుట్ ఫామిలీ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు... మొదటి షో నుండే ఆడియన్స్ పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. దీంతో కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో రాబడుతోంది ఈ సినిమా.
అయితే సినిమా సూపర్ హిట్టైన సంధర్బంగా ఆడియెన్స్ కు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు మేకర్స్. అదేంటంటే సెప్టెంబర్ 14 గురువారం రోజున ఈ సినిమా చూసిన ఆడియన్స్ కు స్టార్ బ్యూటీ అనుష్కతో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ఈ బంపర్ ఆఫర్ కొట్టేయాలంటే.. ప్రేక్షకులు సెప్టెంబర్ 14న మీ ‘Miss. శెట్టి Mr. పొలిశెట్టి సినిమా చూసి.. ఆ టికెట్ పైన తమ ఫోన్ నెంబర్ రాసి థియేటర్స్ లో ప్రత్యకంగా ఏర్పాటు చేసిన బాక్సులో వేయాల్సి ఉంటుంది.
అలా ప్రతి థియేటర్ నుంచి కలెక్ట్ చేసిన టికెట్స్ లో ఇద్దరు లక్కీ లేడీస్ ను సలెక్ట్ చేసి వారికి లేడీ లక్ అనుష్కతో స్వయంగా ఫోన్లో మాట్లాడే అవకాశాన్ని కల్పించనున్నారు. అయితే.. ఈ బంపర్ ఆఫర్ కేవలం సెప్టెంబర్ 14న మాత్రమే ఉంటుందని చెప్పుకొచ్చారు మేకర్స్. మరి అనుష్కతో మాట్లాడే ఆ ఛాన్స్ కొట్టేసే ఆ ఇద్దరు లక్కీ లేడీస్ ఎవరో చూడాలి మరి.