మున్సిపల్ కార్మికుల హక్కుల కోసం పోరాటానికి సిద్ధం

మున్సిపల్ కార్మికుల హక్కుల కోసం పోరాటానికి సిద్ధం

నిజామాబాద్ సిటీ, వెలుగు:  కార్మికుల హక్కులు, వారి ఉద్యోగ భద్రత కోసం పోరాడిన వ్యక్తి చంద్రసింహా అని సీఐటీయూ జిల్లా గౌరవ అధ్యక్షుడు రమేశ్ బాబు అన్నారు.  మున్సిపల్ కార్మిక  సీఐటీయూ నాయకుడు చంద్ర సింహా  సంతాప సభ సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు.  చంద్రసింహా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.  ఈ సందర్భంగా రమేశ్ బాబు మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్‌ లో మున్సిపల్ కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వేతనాల కన్న ఎక్కువ ఇస్తున్నారు.రాష్ట్రంలో కూడా ఆ విధంగా వేతనాలు  అమలు చేస్తామని ఇచ్చిన హామీని గత  ప్రభుత్వం మరిచిపోయిందన్నారు. 

కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించే వారిపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చనిపోయిన కార్మికుల కు గత పదేళ్లుగా దహన సంస్కారాలకు రూ. 20 వేలు ప్రకటించినా వాటిని ఇవ్వకుండా నిజామాబాద్ జిల్లాలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.  సంతాప సభలో మున్సిపల్ యూనియన్ నాయకులు భూపతి, ఏకనాథ్, వర్మ, శంకర్, మోహన్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.