Good Info : ఇలా చేస్తే.. మీకు పాన్ కార్డు వెంటనే వస్తుంది..

Good Info : ఇలా చేస్తే.. మీకు పాన్ కార్డు వెంటనే వస్తుంది..

ఆర్థిక లావాదేవీలు చేసే ప్రతి ఒక్కరికీ ఈ రోజుల్లో పాన్ కార్డు అనేది అత్యవసరం.  బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా,  ఇన్వెస్ట్‌మెంట్లు పెట్టడానికైనా, ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడానికైనా, జీతం పొందడం వంటి రకరకాల ముఖ్యమైన ఆర్థిక లావాదేవీల కోసం పాన్ కార్డు అవసరం పడుతుంది.

పాన్ కార్డులు లేకపోతే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.  ఒకప్పుడు పాన్ కార్డు తీసుకోవాలంటే వారాల సమయం పట్టేది. కానీ ఇప్పుడు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టుకొని సింపుల్‌గానే పొందొచ్చు.  

ఈ-పాన్ కోసం ఇలా అప్లై చేయాలి :

స్టెప్ 1: మీకు నచ్చిన ఏదైనా ఇంటర్నెట్ బ్రౌజర్‌‌ని ఓపెన్‌‌ చేసి https://www.incometax.gov.in/iec/foportal/ లింకుకు వెళ్లండి.
స్టెప్ 2: హోమ్‌‌పేజీలో మీరు ఈ–పాన్‌‌ కోసం దరఖాస్తు చేయడానికి సంబంధించిన ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
స్టెప్ 3: ఇక్కడి నుంచి మరో విండోకు డైరెక్ట్ అవుతుంది. దీనిలోని 'గెట్‌‌ న్యూ ఈ–పాన్‌‌' అనే   హైపర్‌‌లింక్ మీకు కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
స్టెప్ 4: మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్  పుట్టిన తేదీని ఇవ్వాలని అడుగుతుంది. మీ వివరాలను వెరిఫే చేయడానికి మన మొబైల్ నంబరుకు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి.

ALSO READ :- బ్యాడ్మింటన్‌‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తెలుగు స్టార్‌ ప్లేయర్

 ఈ-పాన్ స్టేటస్‌‌ను చూడటం ఇలా:
స్టెప్ 1: వెబ్‌‌సైట్ హోమ్‌‌పేజీకి వెళ్లి, ఈ–-పాన్‌‌కు సంబంధించిన ట్యాబ్‌‌పై క్లిక్ చేయండి
స్టెప్ 2: ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది. దీనిలో మీరు 'చెక్ స్టేటస్ /డౌన్‌‌లోడ్‌‌ పాన్' అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి
స్టెప్ 3: కొత్త పేజీలో మీ ఆధార్ నంబర్ ఇవ్వాలని అడుగుతారు. మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్‌‌ నంబరుకు వచ్చిన ఓటీపీనిఎంటర్ చేస్తే పాన్‌‌కార్డు స్టేటస్  తెలుస్తుంది
స్టెప్ 4: మీ ఈ–పాన్‌‌కార్డు రెడీగా ఉంటే వెంటనే డౌన్‌‌లోడ్ చేసుకోవచ్చు