ఘన శ్యామ్ జ్యువెలర్స్ ప్రీత్ కుమార్ అగర్వాల్ అరెస్ట్

ఘన శ్యామ్ జ్యువెలర్స్ ప్రీత్ కుమార్ అగర్వాల్ అరెస్ట్

హైదరాబాద్: బంగారం స్మగ్లింగ్ కేసులో ఘన శ్యామ్ జ్యువెల్లర్స్ యజమాని కుమారుడు ప్రీత్ కుమార్ అగర్వాల్ ను ఈడీ అరెస్టు చేసింది. ఎగుమతి చేసే బంగారాన్ని దేశీయంగా అమ్మి సొమ్ము చేసుకున్నట్టు అభియోగాలపై అరెస్టు చేసినట్లు సమాచారం. డీఆర్ఐ  కేసు ఆధారంగా దర్యాప్తు చేస్తున్న ఈడీ కోల్ కతా విమానాశ్రయం లో 2018 లో బంగారం స్వాధీనం చేసుకోవడం సంచలనం రేపింది. సుమారు 250 కిలోల బంగారం అక్రమాలకు పాల్పడినట్టు ఈడీ తేల్చింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో సోదాలు చేసిన ఈడీ పెద్ద ఎత్తున హవాలా లావాదేవీలు జరిపినట్టు  గుర్తించారు. భారీగా టాక్స్ ఎగవేసి అక్రమార్జనతో ఆస్తులు కూడబెట్టుకున్నట్టు ఈడీ గుర్తించి తాజా ఆధారాలతో అరెస్టు చేసింది.