నెయ్యితో జుట్టు సాఫ్ట్​గా

నెయ్యితో జుట్టు సాఫ్ట్​గా

నెయ్యిలో బోలెడు పోషక విలువలు ఉన్నాయి. అందుకే దాన్ని మెడిసిన్‌‌‌‌గా వాడుతుంటారు. ఇదే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా నెయ్యిని వాడొచ్చని అంటున్నారు ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌ .  

  • నెయ్యిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, ఒమెగా– 3 ఫ్యాటీ యాసిడ్స్ చర్మానికి పోషణనిస్తాయి. డ్రై, డెడ్ స్కిన్ ఉన్నా పోతుంది. అందుకు ప్రతిరోజు పడుకునే ముందు ముఖానికి నెయ్యి రాసుకోవాలి.
  • నెయ్యి ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది. చర్మంపై కొల్లాజెన్ ఉత్పత్తి అయ్యేలా చేసి స్కిన్ టోన్‌‌‌‌ను మెరుగుపరుస్తుంది. ఇందులో ఉన్న విటమిన్– ఎ, ఫ్యాటీ యాసిడ్స్‌‌‌‌ చర్మాన్ని తేమగా ఉంచుతాయి. 
  • చర్మం పొడిబారడం కూడా ఇన్ఫెక్షన్‌‌‌‌కు కారణమే. చర్మం పొడిబారడం వల్ల ఎర్రగా దద్దుర్లు వస్తుంటాయి. వాటిపైన నెయ్యి రాస్తే కొంతవరకు ఉపశమనం దొరుకుతుంది.
  • కొంతమందికి ఏ కాలంలో అయినా పెదవులు పగులుతుంటాయి. అలాంటి వాళ్లు పెదవులపై నెయ్యి రాస్తే, మృదువుగా ఉంటాయి. 
  • నెయ్యిలో ఉండే విటమిన్– ఎ ,ఇ జుట్టుకు మేలు చేస్తాయి. నెయ్యిలోని యాంటీ ఆక్సిడెంట్స్‌‌‌‌ జుట్టు పొడిబారకుండా చేస్తాయి. దాంతో జుట్టు మృదువుగా అవుతుంది. అందుకని అప్పుడప్పుడు జుట్టుకు నెయ్యి రాయాలి.