కాటేదాన్ స్పోర్ట్ కాంప్లెక్స్ పనులు వెంటనే పూర్తి చేయాలి: కమిషనర్

కాటేదాన్ స్పోర్ట్ కాంప్లెక్స్ పనులు వెంటనే పూర్తి చేయాలి: కమిషనర్

హైదరాబాద్ సిటీ, వెలుగు: కాటేదాన్ స్పోర్ట్ కాంప్లెక్స్ లో అసంపూర్తిగా ఉన్న పనులు వెంటనే పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం చార్మినార్ జోన్ లోని పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో స్విమ్మింగ్ ఫూల్ కు వాటర్ కనెక్షన్ కోసం జలమండలి అధికారులకు కమిషనర్ ఫోన్ చేశారు. 

వాటర్ కనెక్షన్, షటిల్  బ్యాడ్మింటన్ ఆట స్థలం పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. పనులు పూర్తి చేసిన వెంటనే స్పోర్ట్స్ సెక్షన్ కు హ్యాండోవర్ చేయాలన్నారు. జోనల్ కమిషనర్ వెంకన్న, ఏసీ స్పోర్ట్స్ యాదగిరి రావు, జోనల్ ఎస్ ఈసీ మహేశ్వర్ రెడ్డి, సీఈ రత్నాకర్, ప్రాజెక్ట్ ఈఈ కేఎల్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.