ఉదయం 7గంటలకే హైదరాబాద్ రోడ్లు సాఫ్ - జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు..!

ఉదయం 7గంటలకే హైదరాబాద్ రోడ్లు సాఫ్ - జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు..!

హైదరాబాద్ లో ఉదయం 7గంటలకే రోడ్ల క్లీనింగ్ పనులు పూర్తవ్వాలని జీహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోజ్ అధికారులకు  ఆదేశాలు జారీ చేసారు. జోనల్ డెప్యూటీ కమిషనర్లతో జరిగిన రివ్యూ మీటింగ్ లో ఈ మేరకు ఆయన ఆదేశించారు. ఉదయం 5.45 నుండే పర్యవేక్షణ పనులు మొదలు పెట్టాలని అధికారులను సూచించారు. సిటీలోని అన్ని షాపింగ్ మాల్స్, కమర్షియల్ కాంప్లెక్స్ లు, ఫంక్షన్ హాల్స్, రెస్టారెంట్స్ నుండి ఉదయాన్నే చెత్తను సేకరించాలని అన్నారు.

పారిశుద్యం యొక్క ప్రాధాన్యత గురించి చెప్పిన కమిషనర్ పనులు సక్రమంగా జరిగేందుకు లోకల్ కార్పొరేటర్ల సాయం కూడా తీసుకోండని అధికారులకు సూచించారు. పారిశుధ్య పనుల్లో లోపాల గురించి ప్రజలు, కార్పొరేటర్ల నుండి వచ్చిన కంప్లయింట్ల ఆధారంగానే ఈ నిర్ణయానికి వచ్చినట్టు అధికారులతో తెలిపారు కమిషనర్ రోనాల్డ్ రోజ్.కమిషనర్ తాజా ఆదేశాలతో ఇక మీదట ఉదయాన్నే సిటీ రోడ్లను క్లీన్ అండ్ గ్రీన్ చూసే అవకాశం త్వరలోనే రానుంది.