
- జియాగూడ కబేళానువిజిట్చేసిన ఆఫీసర్
- ఆధునికీకరణ కోసం టెండర్లు పిలిచి పనులను ప్రారంభించాలని ఆదేశం
హైదరాబాద్ సిటీ, వెలుగు: జియాగూడ స్లాటర్ హౌజ్ ఆధునికీకరణ పనులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ప్రాజెక్ట్స్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కార్వాన్ సర్కిల్‌లోని జియాగూడ కబేళా స్లాటర్ హౌస్‌ను ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, చీఫ్ ఇంజనీర్ (మెయింటెనెన్స్) సహదేవ్ రత్నాకర్, చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ అబ్దుల్ వకీల్ తో కలిసి తనిఖీ చేశారు.
స్లాటర్ హౌస్ ఆధునికీకరణకు ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, త్వరగా టెండర్లను పిలిచి పనులను ప్రారంభించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రాంగణంలో పేరుకుపోయిన చెత్త, నిర్మాణ వ్యర్థాలు తక్షణమే తొలగించాలని, శుభ్రమైన వాతావరణం ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రోడ్డుపై మేకల క్రయవిక్రయాలతో పాటు వ్యర్థాలు ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దుర్గంధం వెదజల్లుతుంటే ఏం చేస్తున్నారని అధికారులను ప్రశ్నించారు.