ఫీల్డ్​లోకి కమిషనర్ కర్ణన్ .. ఆరాంఘర్ – జూపార్కు ఫైఓవర్ పనుల పరిశీలన

ఫీల్డ్​లోకి కమిషనర్ కర్ణన్ .. ఆరాంఘర్ – జూపార్కు ఫైఓవర్ పనుల పరిశీలన
  • భూసేకరణ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ఆదేశం

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ కమిషనర్ గా మంగళవారం బాధ్యతలు చేపట్టిన ఆర్వీ కర్ణన్.. బుధవారం నుంచే ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆరాంఘర్ నుంచి జూపార్క్ వరకు చేపట్టిన ఫ్లైఓవర్, శాస్త్రీపురం ఆర్ఓబీ పనులను పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ.. ఆరాంఘర్ ఫ్లైఓవర్ అప్ డౌన్ ర్యాంప్ ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. 

ఆర్ఓబీ(రైల్వే ఓవర్ బ్రిడ్జి) పనులు సంబంధించి రైల్వే వర్క్స్​పెండింగ్‌‌‌‌ ఉన్నాయని ప్రాజెక్ట్ ఈఈ బీఎల్ శ్రీనివాస్.. కమిషనర్‌‌‌‌కు వివరించారు. రైల్వే పనులు పూర్తయిన 30 నుంచి 45 రోజుల్లో ప్రాజెక్ట్ పనులు పూర్తవుతాయని ఇంజినీరింగ్ అధికారులు కమిషనర్‌‌‌‌కు తెలిపారు. అంతకుముందు మిస్ వరల్డ్ పోటీలకు వచ్చేవారు చార్మినార్‌‌‌‌ను విజిట్​చేసే అవకాశం ఉండడంతో చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్‌‌‌‌ వెంకన్నను ఆదేశించారు.