
హైదరాబాద్ సిటీ, వెలుగు: మాన్సూన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ బల్దియా అధికారులు, సిబ్బందికి సూచించారు. గురువారం శేరిలింగంపల్లిలో జోనల్ కమిషనర్ బోర్కడే హేమంత్ సహదేవ్ రావుతో కలిసి పర్యటించారు. ముందుగా కావూరి హిల్స్ లో కార్మికులతో మాట్లాడారు. అక్కడి నుంచి పటాన్ చెరువుకు వెళ్లి స్పెషల్ డ్రైవ్ పనులను పరిశీలించారు. దోమల వృద్ధిని అరికట్టేందుకు డ్రై డే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.