గ్రేటర్ వార్: ఒక్కో బూత్​లో మినిమం ఓట్లు పడేలా ప్లాన్​

గ్రేటర్ వార్: ఒక్కో బూత్​లో మినిమం ఓట్లు పడేలా ప్లాన్​

టార్గెట్ @ 300

పోల్​మేనేజ్​మెంట్ పై క్యాండిడేట్ల దృష్టి

పోలింగ్​శాతం పెంచేందుకు ప్రయత్నం

హైదరాబాద్, వెలుగు: 64 వేల ఓటర్లు ఉన్న సనత్ నగర్ డివిజన్ పరిధిలో  గత ఎన్నికల్లో 24 వేల ఓట్లు పోలైతే, ఇందులో 12,331 టీఆర్ఎస్ కు వేశారు. మిగిలిన ఓట్లను అన్ని పార్టీలు పంచుకున్నాయి. ఈ డివిజన్ లో  82 బూత్ లు ఉండగా ఒక్కో బూత్ లో సగటున 800 ఓట్లు ఉన్నాయి. ఒక్కో బూత్ లో కనీసం 300 ఓట్లు పడితే వారికి గెలిచే చాన్స్​ఎక్కువగా ఉంటుంది. అందుకే కొందరు క్యాండిడేట్లు పోల్​మేనేజ్​మెంట్​పై దృష్టి పెట్టారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలిచేందుకు ఉన్న అన్ని అవకాశాలను క్యాండిడేట్లు పరిశీలిస్తున్నారు. గత ఎన్నికల పోలింగ్​శాతం ఆధారంగా ప్రతిపక్ష క్యాండిడేట్లు కొత్త ప్లాన్లు వేస్తున్నారు. గత ఎన్నికల్లో డివిజన్ లో నమోదైన పోలింగ్, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయి, ఒక్కో బూత్ లో వచ్చిన ఓట్లు ఇలా అన్ని వివరాలు ఇప్పటికే సేకరించారు. డివిజన్ లో ఉన్న బస్తీలు, లాక్ డౌన్ కారణంగా డోర్ లాక్ ఉన్న ఇండ్ల వివరాలను వేర్వేరుగా సిద్ధం చేసుకుంటున్నారు. ఓవైపు ప్రచారం నడుస్తుండగానే మరోవైపు డివిజన్ లోని బస్తీలు, కాలనీలు, ఇతర సామాజికవర్గాల వారీగా ఓటర్ల విభజన.. ఇలా అన్ని అంశాలను అంచనా వేస్తున్నారు. పోలింగ్ శాతం పెరిగితే తమకు లాభం జరుగుతుందని భావిస్తున్న క్యాండిడేట్లు సామాజికవర్గం, కులాలు, మతాలు, పార్టీ అనుకూలతలను బట్టి పోల్ మేనేజ్ మెంట్ పై దృష్టి పెడుతున్నారు.

బూత్‌ల వారీగా టార్గెట్

డివిజన్​లో గెలిచే అవకాశం ఉన్న క్యాండిడేట్లు బూత్ ల వారీగా టార్గెట్లను పెట్టుకుని ఓటర్లకు గాలం వేస్తున్నారు. నల్లకుంట డివిజన్ లో 52 బూత్ లలో 49,711 ఓట్లు ఉన్నాయి. ఒక్కో బూత్​లో కనీసం 200 ఓట్లు వస్తే గెలుపు ఈజీ అవుతుందని క్యాండిడేట్లు అంచనా వేస్తున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో తార్నాక డివిజన్ ఉండగా 70 బూత్​లలో 62,337 మంది ఓటర్లు ఉన్నారు. ఒక్కో బూత్ పరిధిలో 900 ఓట్ల వరకు ఉంటాయి. గత ఎన్నికల్లో 28 వేల ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో ఒక్కో బూత్ లో కనీసం 250 నుంచి 350 ఓట్లు సాధించడంపై పార్టీలు దృష్టి పెట్టాయి. సిట్టింగ్ కార్పొరేటర్ టీఆర్ఎస్ కాగా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ స్థానంలో గెలుపుపై ఆశలు పెట్టుకున్నాయి. పోల్​మేనేజ్​మెంట్​తోపాటు ప్రభుత్వ వ్యతిరేకతతో అధికార పార్టీ ఓట్లు చీలితే తమకు మరింత లాభం చేకూరుతుందని క్యాండిడేట్లు భావిస్తున్నారు.

హాస్పిటల్స్ మంచిగ లేవ్
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కోవిడ్ టెస్ట్‌లు సరిగా చేయలేదు. ప్రైవేటు హాస్పిటల్ లో కన్సల్టెంట్ ఫీజులే వేలకు వేలు ఉంటున్నయ్. ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలు మంచిగ ఉంటే ప్రైవేటు హాస్పిటల్స్ చుట్టూ ఎందుకు తిరుగుతం?. జనాలు మంచిగా ఉంటేనే కదా ఓట్లేసి గెలిపించేది. నాయకులను అడిగేది ఒక్కటే. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఫెసిలిటీస్ కల్పించండి.
‑ గణేశ్, ప్రైవేట్ ఎంప్లాయ్, కూకట్ పల్లి

కేంద్రం చెప్పినా అమలు చేస్తలే
కండరాల బలహీనతతో మేం కుర్చీకే పరిమితమై ఉంటాం. మాకూ ఓటు హక్కు ఉంది. ఎన్నికలు రాగానే మాకోసం అది చేస్తాం .. ఇది చేస్తాం అంటారు. కానీ తర్వాత ఎవరూ పట్టించుకోరు. 2016లో మాలాంటి వాళ్ల కోసం కేంద్రం హైనీడ్ సూచించింది. కానీ అది ఇక్కడ ఇంతవరకు అమలులోకి రాలేదు. ఎంపీలు, ఎమ్మెల్యేలను కలిసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. బ్యాటరీ చైర్స్ ప్రొవైడ్ చేసి మాకు టాయిలెట్స్, ర్యాంప్ లు ఏర్పాటు చేయాలి. సిటీలో మాలాంటి వారు చాలామంది ఉన్నారు. వారి సమస్యలను పరిష్కరించాలె.

‑ కె. బాలకృష్ణ, సికింద్రాబాద్

For More News..

ఫండ్స్​ ఇయ్యకున్నా పనుల్జేయాలె.. సర్పంచులపై ఆఫీసర్ల ఒత్తిడి

భూమి లాక్కోవద్దంటూ దంపతుల ఆత్మహత్యాయత్నం

జీహెచ్ఎంసీ బడ్జెట్​ కొండంత.. ఖర్చు గోరంత