రోడ్డు పై చెత్తేసినందుకు ఫైన్

రోడ్డు పై చెత్తేసినందుకు ఫైన్

హైదరాబాద్, వెలుగు:  సిటీలో  అక్రమ కట్టడాలు, ఫుట్ పాత్ ల ఆక్రమణల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది.  మూసాపేట్ ఏరియాలోని  కాముని చెరువు  పరిధిలో ఏర్పాటు చేసిన అక్రమ కట్టడాలను  బల్దియా అధికారులు  కూల్చి వేశారు.  ఆ ప్రాంతంలో  ఫుట్ పాత్ ల ఆక్రమణలను  తొలగించారు. యూసఫ్ గూడలో స్వచ్ఛ తనిఖీలు చేపట్టిన అధికారులు  పలు హోటళ్లు, వైన్ షాపుల  నిర్వాహకులకు జరిమానా విధించారు. యూనివర్సల్ హోటల్ కు రూ.20 వేలు జరిమానా విధించారు.

కూకట్​పల్లి:‘సాఫ్​ హైదరాబాద్​ షాన్​దార్​  హైదరాబాద్’​ లో భాగంగా మూసాపేట్​ సర్కిల్ డీసీ వి. మమత సర్కిల్ పరిధిలోని భరత్​నగర్​ మార్కెట్​ రోడ్డులో పర్యటించారు.   మార్కెట్​ రోడ్డులో ఉన్న కూరగాయల  దుకాణదారులు కూరగాయల వ్యర్ధాలను, చెత్తను మొత్తం రోడ్డు వెంట ఉన్న గోడ పక్కనే పడవేస్తున్నారు. దీంతో బుధవారం డీసీ చెత్త వేస్తున్న వారితోనే వ్యర్థాలను తొలగించి, ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి దుకాణదారులతో కలిసి మొక్కలను నాటారు.  ప్రతి ఒక్కరూ స్వచ్ఛ హైదరాబాద్​లో భాగంగా చెత్తను రోడ్లపై వేయకుండా చెత్త బుట్టలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం బాలాజీనగర్​ డివిజన్​లో పర్యటించి కాలనీవాసులు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి జీహెచ్​ఎంసీ కార్మికులకు అందజేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు.  బాలాజీనగర్  శివబాలాజీ వైన్స్​కు రూ.20 వేలు,  పీపుల్స్​ బార్​ అండ్​ రెస్టారెంట్ కు రూ.15వేలు, మాత వైన్స్​కు రూ. 5 వేలు, శివ బాలాజీ వైన్స్ ​ పాన్ షాప్​కు రూ. 500, మొత్తం  రూ. 40,500 ఫైన్​లు విధించి వసూలు చేశారు.  ఎమ్మార్వో నిర్మల,  హార్టికల్చర్​ మేనేజర్​ మాలినిరెడ్డి,   ఎస్​ఎస్​లు మురళీధర్​రెడ్డి, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.