హైదరాబాద్ రిలయన్స్ రిటైల్ స్టోర్సులో తనిఖీలు.. శాంపిల్స్ తీసుకెళ్లిన అధికారులు

హైదరాబాద్ రిలయన్స్ రిటైల్ స్టోర్సులో తనిఖీలు.. శాంపిల్స్ తీసుకెళ్లిన అధికారులు

హైదరాబాద్లోని రిలయన్స్ రిటైల్ స్టోర్స్లో జీహెచ్ఎంసీ అధికారులు సోదాలు నిర్వహించారు. పటాన్‌చెరులోని రిలయన్స్‌ రిటైల్‌ స్టోర్లో జీహెచ్‌ఎంసీ ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ భాను తేజ గౌడ్‌ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. స్టోర్లోని ఆహార పదార్థాలను పరిశీలించారు. తనిఖీల తర్వాత రిలయన్స్ రిటైల్ స్టోర్ నుంచి  నమూనాలను తీసుకెళ్లారు. 

హైదరాబాద్‌లోని ప్రసిద్ధ కరాచీ బేకరీతో పాటు..విజయ మిల్క్ పార్లర్ లోనూ జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వినియోగదారుడు కరాచీ బేకరీపై కంప్లైంట్ చేయగా.. జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్-1 లో ఉన్న కరాచీ బేకరీపై వచ్చి కంప్లైంట్ ఆధారంగా.. ఖైరతాబాద్ సర్కిల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ శ్రీవెనక.. కరాచీ బేకరిలో తనిఖీలు నిర్వహించారు. ఆ తర్వాత అనుమానమున్న పలు నమూనాలు సేకరించి పరీశీలనకు పంపించారు. కరాచీ బేకరీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించడంపై వినియోగదారులు ఆందోళన చెందారు.

తాజాగా రిలయన్స్ రిటైల్ స్టోర్స్ లోనూ జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించడంపై వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.