అడగందే అమ్మైనా అన్నం పెట్టదు..కేసీఆర్ దేవుడిలా అడగకుండానే రూ.550 కోట్లిస్తున్నారు

అడగందే అమ్మైనా అన్నం పెట్టదు..కేసీఆర్ దేవుడిలా అడగకుండానే రూ.550 కోట్లిస్తున్నారు

భారీ వరదల నుంచి హైదరాబాద్ ప్రజల్ని ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ రూ.550కోట్లు కేటాయించారు.  వ‌ర‌ద నీటి ప్రభావానికి గురైన ప్రతీ  ఇంటికి రూ. 10 వేలు, ఇల్లు పూర్తిగా కూలిపోయిన వారికి రూ. ల‌క్ష  , పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. 50 వేలు చొప్పున ఆర్ధిక సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆర్ధిక సాయంపై మేయర్ బొంతు రామ్మోహన్ ప్రశంసల వర్షం కురిపించారు. అమ్మ అడిగితేనే అన్నం పెడుతుంది.. కానీ అడగకుండా తెలుసుకొని దేవునిలాగా సీఎం కేసీఆర్ హైదరాబాద్ ప్రజలకోసం రూ.550 కోట్ల సాయం ప్రకటించారని అన్నారు. రాత్రనక , పగలనక టీఆర్ఎస్ నేతలు నిద్రపోకుండా ప్రజల కోసం కష్టపడుతున్నారని జోస్యం చెప్పారు. నగర ప్రజలమీద కేసీఆర్ దయాగుణం చూపడం అభినందనీయం అంటూ బొంతు రామ్మోహన్ పొగడ్తల వర్షం కురిపించారు.