గ్రేటర్ సిటీ అభివృద్ధికి రూ.10,500 కోట్లు కేటాయించాలి : మేయర్ విజయలక్ష్మి

గ్రేటర్ సిటీ అభివృద్ధికి రూ.10,500 కోట్లు కేటాయించాలి : మేయర్ విజయలక్ష్మి
  • 16వ ఫైనాన్స్ కమిషన్ ను కోరిన మేయర్ విజయలక్ష్మి

హైదరాబాద్, వెలుగు : గ్రేటర్ సిటీ అభివృద్ధికి రూ.10,500 కోట్లు కేటాయించాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్​విజయలక్ష్మి 16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ డాక్టర్ అరవింద్ పనగరియాను కోరారు. సోమవారం ప్రజాభవన్ లో 16వ కేంద్ర ఆర్థిక సంఘం రాజకీయ పార్టీల సమావేశం జరిగింది. మేయర్ విజయలక్ష్మి పాల్గొని మాట్లాడారు. దేశంలోని ప్రధాన నగరాల్లో హైదరాబాద్​ఒకటని, పెరుగుతున్న జనాభా అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. గడిచిన పదేండ్లలో జీహెచ్ఎంసీ సుమారు రూ.18వేల కోట్ల మూలధనాన్ని ఖర్చు చేసిందని తెలిపారు.

ఇందులో రూ.6 వేల కోట్లు అప్పులు ఉన్నాయని చెప్పారు. వచ్చే 5 ఏండ్లలో  సిటీ అభివృద్ధికి రూ.18 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. రూ.7,500 కోట్లతో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉందన్నారు. రోడ్లు విస్తరించాలని, స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ల నిర్మాణం, ట్రాఫిక్ నియంత్రణ, వాయు కాలుష్య నివారణ, వరద ముంపు లేకుండా చేయాల్సి ఉందని చెప్పారు. రూ.1,500 కోట్లతో డంప్ సైట్ల బయో రీమీడియేషన్, చెరువుల సంరక్షణ, వరదల నివారణకు రూ.800 కోట్లు

జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డీటైల్ మ్యాప్, ప్రాపర్టీ అసెస్మెంట్ కోసం  రూ.250 కోట్లు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ అప్లికేషన్, ట్రాఫిక్ మేనేజ్మెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం రూ.250 కోట్లు, పురావస్తు, వారసత్వ సంపద కాపాడుకునేందుకు రూ.200 కోట్లు కావాలని కోరారు.16వ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రెండు విభాగాలకు మాత్రమే మంజూరీ చేయాలని సిఫార్సు చేశారని మేయర్​గుర్తుచేశారు.