వీధి కుక్కలకు ఒకే గిన్నెలో ఫుడ్డా?

వీధి కుక్కలకు ఒకే గిన్నెలో ఫుడ్డా?

హైదరాబాద్, వెలుగు : చార్మినార్ జోన్ పరిధి  లోని చుడీబజార్ యానిమల్ కేర్ సెంటర్​ను జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సోమవారం తనిఖీ చేశారు. వీధి కుక్కల థియేటర్లు, రిహాబిలిటేషన్ సెంటర్, స్టెరిలైజేషన్ ​డాగ్ సెంటర్​ను పరిశీలించారు. వీధి కుక్కలకు ఒకే గిన్నెలో ఫుడ్ వేయడంపై  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి సరిగా ఫుడ్ అందించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. స్టెరిలైజేషన్ ప్రాసెస్ పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. డాగ్స్ కెన్నెల్స్ ​కెపాసిటీ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని మేయర్ ఆదేశించారు. వీధి కుక్కలను పట్టుకోవడానికి 10 వెహికల్స్​ఉన్నాయని, ఉదయం 5.30 గంటల నుంచే పట్టుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిఒక్క ఏరియాలో కుక్కలకు తాగునీటి వసతి ఏర్పాటు చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని  హెచ్చరించారు. మిగిలిన ఏరియాల్లోని యానిమల్ కేర్ సెంటర్లను తనిఖీ చేస్తామని చెప్పారు. 

హెచ్ఎండీఏ పరిధిలో మరికొన్ని యానిమల్ కేర్ సెంటర్ల ఏర్పాటుకు ప్లాన్​ చేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం డైలీ 42 నుంచి 45 సర్జరీలు చేస్తున్నామని అధికారులు చెప్పగా, 60 నుంచి 70 సర్జరీలు చేయాలని మేయర్ ఆదేశించారు.  మేయర్ ​వెంట డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ అశోక్, వెటర్నరీ అధికారి డాక్టర్ రాంచందర్ ఉన్నారు.