హైదరాబాద్కు గుడ్ న్యూస్: ఈ ఫాగింగ్ మెషిన్స్తో అరగంటలో దోమలన్నీ మటాష్

హైదరాబాద్కు గుడ్ న్యూస్:  ఈ ఫాగింగ్ మెషిన్స్తో అరగంటలో దోమలన్నీ మటాష్

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్​ పరిధిలో దోమల నియంత్రణకు జీహెచ్ఎంసీ కొత్త ప్లాన్ ​వేసింది. ఇప్పటివరకు ఉపయోగిస్తున్న హాట్​ ఫాగింగ్​ మెషీన్లతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఫిర్యాదులు పెరుగుతుండడంతో కూల్ ఫాగింగ్ మెషీన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా ఈ సిస్టమ్​ను పైలట్​ప్రాజెక్టుగా నగరంలో అమలు చేయబోతున్నామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రకటించారు. 

మంగళవారం కూల్​ ఫాగింగ్ ​మెషీన్లను కమిషనర్ ఆమ్రపాలితో కలిసి బల్దియా హెడ్డాఫీసులో మేయర్​ ప్రారంభించారు. ఈ సందర్భంగా మెషీన్లు ఎలా పని చేస్తాయో చూపించారు. మేయర్, కమిషనర్​​మాట్లాడుతూ మొత్తం మూడు మెషీన్లు తెచ్చామని, కూల్ ఫాగింగ్ వల్ల అరగంటలో దోమలు చనిపోతాయన్నారు. గుజరాత్ లో కూల్ ఫాగింగ్ సక్సెస్ ఫుల్ గా రన్​అవుతోందని చెప్పారు. ఏడాది పాటు హాట్ ఫాగింగ్ కి అయ్యే డీజిల్ ఖర్చుతో కూల్ ఫాగింగ్ మెషినరీ కొనొచ్చన్నారు. జోనల్ కమిషనర్లు హేమంత్ కేశవ్ పాటిల్, అపూర్వ చౌహాన్, వెంకన్న, రవికిరణ్, అడిషనల్ కమిషనర్ పంకజ, చీఫ్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ రాంబాబు పాల్గొన్నారు.

Also Read:-హోం లోన్, కార్లు, పర్సనల్ లోన్స్ పై వడ్డీ రేట్లు పెరగలేదు