
జూబ్లీహిల్స్, వెలుగు: నిబంధనలకు విరుద్ధంగా అదనపు అంతస్తును ఎందుకు కట్టారని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కు టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ కార్యాలయం ఉంది. ఆ ఆఫీసు నిర్మాణానికి జూబ్లీహిల్స్ సర్కిల్18వ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు రెండు సెల్లార్స్ తో పాటు జీ ప్లస్ 4 నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. కానీ, అరవింద్ అదనంగా మరో అంతస్తు నిర్మించారు. దీనిపై టౌన్ ప్లానింగ్ అధికారులు అదనపు అంతస్తును ఎందుకు కూల్చకూడదో వివరణ ఇవ్వాలని అరవింద్ కు నోటీసులు జారీ చేశారు.