ముగిసిన 40 ఏళ్ల మూసారాంబాగ్ బ్రిడ్జి ప్రస్థానం

ముగిసిన 40 ఏళ్ల మూసారాంబాగ్ బ్రిడ్జి ప్రస్థానం

 హైదరాబాద్ లో 40 ఏళ్ల క్రితం నిర్మించిన  మూసారాంబాగ్ ఓల్డ్ బ్రిడ్జి ప్రస్థానం ముగియనుంది. అంబర్​పేట, దిల్​సుఖ్​నగర్ ప్రాంతాలను కలిపే మూసారాంబాగ్ పాత బ్రిడ్జి కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి.  ఇప్పటికే ఓవైపు కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతుండగా, పాత బ్రిడ్జి ఇటీవల మూసీకి వచ్చిన భారీ వరదలతో కోతకు గురైంది. దీంతో పటిష్టతను పరిశీలించిన జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులు.. ఈ బ్రిడ్జి పై నుంచి వాహనాల రాకపోకలు సురక్షితం కాదని, కూల్చివేయాలని నిర్ణయించారు. ఏ ప్రమాదం జరగకుండా బ్రిడ్జికి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి బ్రిడ్జిని కూల్చివేస్తున్నారు అధికారులు.

దశాబ్దాలుగా దిల్ సుఖ్ నగర్, అంబర్ పేట కు రాకపోకలకు వారధిగా నిలిచింది మూసారాంబాగ్ బ్రిడ్జ్.  మూసీ పై కొత్తగా మూసారాంబాగ్ బ్రిడ్జ్ నిర్మాణం మొదలు పెట్టి దాదాపు మూడేళ్ళ అయ్యింది.  రూ. 52 కోట్ల రూపాయలతో మూసారాంబాగ్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టింది గత బీఆర్ఎస్ సర్కార్.  మూడేళ్లైనా  220 మీటర్ల పొడవు ఉన్న మూసారాంబాగ్ బ్రిడ్జ్ ఇంకా పూర్తి కాలేదు.  ఈ క్రమంలో కొత్త బ్రిడ్జి పనులు స్పీడప్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.  కొత్త బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన తర్వాత పాత బ్రిడ్జిని కూల్చాలని అధికారులను కోరుతున్నారు. 

ALSO READ : అమెజాన్ ఫెస్టివల్ సేల్ ఇంకా వుంది..

పాత బ్రిడ్జి స్థానంలో కొత్తది నిర్మించాలని ప్రతిపాదించారు . 2026  జూన్ నాటికి కొత్త బ్రిడ్జి నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్త హై లెవల్ బ్రిడ్జి నిర్మాణంలో ఉండగానే పాత బ్రిడ్జిని కూల్చివేస్తున్నారు. అంబర్​పేట, దిల్​సుఖ్​నగర్ మధ్య ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయంగా గోల్నాక బ్రిడ్జిపై నుంచి వెళ్లాలని అధికారులు  సూచిస్తున్నారు.