ఇక నుంచి సెక్యూరిటీ గార్డ్స్, గ్రీన్ మార్షల్స్గా ట్రాన్స్ జెండర్స్.. పరిశీలిస్తున్న జీహెచ్ఎంసీ

ఇక నుంచి సెక్యూరిటీ గార్డ్స్, గ్రీన్ మార్షల్స్గా ట్రాన్స్ జెండర్స్.. పరిశీలిస్తున్న జీహెచ్ఎంసీ

సమాజంలో ఆదరణకు నోచుకోక, ఉపాధి లేక ఇబ్బందులకు గురవుతున్న ట్రాన్స్ జెండర్లకు ఉపాధి అవకాశాలు కల్పస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అందులో భాగంగా ఇప్పటికే ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించింది. లేటెస్ట్ గా గ్రేటర్ హైదరాబాద్ లోని పలు విభాగాల్లోకి ట్రాన్స్ జెండర్లను నియమించుకోవాలని GHMC నిర్ణయించింది. బుధవారం (మే 14) బల్దియా కార్యాలయంలో ట్రాన్స్ జెండర్లతో సమావేశం నిర్వహించారు అధికారులు. 


జీహెచ్ఎంసీ లోని పలు విభాగాల్లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ట్రాన్స్ జెండర్లను నియమించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జీహెచ్ఎంసీ పార్కులు, గ్రౌండ్స్, వాటర్ బోర్డు రిజర్వాయర్ మొదలైన ప్రాంతాలలో సెక్యూరిటీ గార్డులుగా నియమించేలా ప్లాన్ చేస్తున్నారు.

అదే విధగా స్ట్రీట్ లైట్స్ మెయింటెనెన్స్, గ్రీన్ మార్షల్స్ గా నియమించేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో మీటింగ్ ఏర్పాటు చేసి ఉపాధి వివరాలను తెలిపారు అధికారులు.