- బాలాపూర్‌లో జీహెచ్‌ఎంసీ, పోలీసుల మెరుపు దాడి
ఓల్డ్‌సిటీ, వెలుగు: బాలాపూర్ పరిధి మదీనా కాలనీలో ఉన్న సలామి మీట్ ఇండస్ట్రీస్‌పై జీహెచ్‌ఎంసీ అధికారులు, బాలాపూర్ పోలీసులు కలిసి శుక్రవారం దాడులు నిర్వహించారు. సుమారు1,100 కిలోల కుళ్లిన మేక మాంసాన్ని స్వాధీనం చేసుకొని, ఐదుగురిని అరెస్ట్ చేశారు.
ఇందులో 8 నెలల నుంచి ఏడాది వరకు నిల్వ ఉంచిన మేక మాంసం, తలకాయలు, కాళ్లు, బోటిని గుర్తించారు. అపరిశుభ్రంగా నిల్వ చేసిన ఈ మాంసాన్ని రోజూ సిటీలోని పలు హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఇండస్ట్రీ నిర్వాహకులైన మహ్మద్ సలామి, అబ్దుల్ గఫార్ ఖాన్, మఫీద్ ఖాన్, గులాం మసూద్, షేక్ మునావర్‌ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు సీఐ సుధాకర్ వెల్లడించారు.
