మౌలాలి దర్గా అభివృద్ధి పనుల పరిశీలన

మౌలాలి దర్గా అభివృద్ధి పనుల పరిశీలన

హైదరాబాద్, వెలుగు: మౌలాలిలోని హజ్రత్ కొహి మౌలాలి దర్గా వద్ద చేపట్టిన అభివృద్ధి పనులను  జీహెచ్ఎంసీ కమిషనర్​రోనాల్డ్​రోస్​మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. దర్గా అభివృద్ధి పనులను రెండు దశల్లో చేపడుతున్నట్లు తెలిపారు. మొదటి దశలో రిటైనింగ్ వాల్​తోపాటు రోడ్డు, మిడిల్ ల్యాండింగ్ వాహనాలను నిలిపేందుకు 1000 చదరపు మీటర్ల పార్కింగ్ పూర్తి చేశామని చెప్పారు.

రెండో దశలో రిటైనింగ్ వాల్ తోపాటు రోడ్డు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఆ పనులు 50 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టర్ సగం పనులు చేసి నిలిపి వేశారని దర్గా నిర్వాహకులు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేయించాలని, భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని కమిషనర్​ఆదేశించారు. ఆయన వెంట ప్రాజెక్ట్​సీఈ దేవానంద్, ఎస్ఈ రవీందర్ రాజు, జోనల్ కమిషనర్ ఉన్నారు.