విలీన ప్రాంతాలను కలిపే బడ్జెట్

విలీన ప్రాంతాలను కలిపే బడ్జెట్
  • 11న బల్దియా స్టాండింగ్ కమిటీ 
  • ముందుకు ప్రతిపాదనలు
  • ఓఆర్ఆర్ వరకు రూ.11వేల కోట్లతో ప్రపోజల్స్

హైదరాబాద్ సిటీ, వెలుగు: 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వీలినమైన లోకల్ బాడీలను కలుపుకొనే జీహెచ్ఎంసీ బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. మొన్నటివరకు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలుగా కొనసాగినపప్పటికీ.. జీవో 264 తర్వాత ఈ ప్రాంతాలన్నీ గ్రేటర్ లో విలీనమయ్యాయి. దీంతో పాటు ఇక్కడ జీహెచ్ఎంసీ పాలన కొనసాగుతోంది. అయితే, ఇక్కడ పాలకమండళ్ల గడువు గతేడాది ముగిసింది. 

ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్లు ఈ ప్రాంతాలకు కూడా కొనసాగుతున్నారు. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విలీనమైన 20 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లను పరిగణనలోకి తీసుకొని బడ్జెట్ కు తుది మెరుగులు దిద్దుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.8,440 కోట్ల బడ్జెట్​కు గతేడాదే జీహెచ్ఎంసీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. 

అయితే, ప్రస్తుతం విలీనమైన ప్రాంతాలతో కలిపి బడ్జెట్అంచనా ప్రపోజల్స్ ప్రిపేర్ చేసినట్టు తెలిసింది. లోకల్ బాడీలన్నింటికి కలిపి రూ.2 వేల కోట్లకి పైగా అంచనాలు రూపొందించగా, మొత్తం రూ.11,050 కోట్ల బడ్జెట్ కి స్టాండింగ్ కమిటీ ఆమోదించే అవకాశాలున్నాయి.  ఆ తర్వాత కౌన్సిల్ సమావేశంలో బడ్జెట్ కి గ్రీన్​సిగ్నల్​ఇవ్వనున్నారు.