
- పౌష్టికాహారం పెట్టనున్న బల్దియా
- కార్మికులు, కూలీలకు ఉపయోగం
హైదరాబాద్ సిటీ, వెలుగు:ఇందిరమ్మ క్యాంటీన్లలో జీహెచ్ఎంసీ కేవలం రూ.5కే రోజుకో రకమైన టిఫిన్ అందించేందుకు సిద్ధమైంది. అది కూడా మిల్లెట్స్ వంటి పౌష్టికాహారంతో సోమవారం నుంచి శనివారం వరకు ఆరు రకాల టిఫిన్స్ అందించేందుకు మెనూ రెడీ చేసింది. ఇందుకోసం మొదటి దశలో రూ.11.43 కోట్లతో సిటీలో 139 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నది. బస్తీ వాసులు, కూలీలు, చిరుద్యోగులకు ఈ స్కీం ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు అంటున్నారు.
త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో టిఫిన్ స్టాళ్లను ప్రారంభింపజేసేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమానికి కూడా హరే రామ హరే కృష్ణ మూవ్ మెంట్ తో ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. మిల్లెట్స్ తో తయారు చేయనున్న టిఫిన్‌కు రూ .19 ఖర్చవుతుండగా, రూ. 5 ప్రజల నుంచి తీసుకోనుండగా, రూ.14ను జీహెచ్ఎంసీ భరించనుంది.
- సోమవారం మిల్లెట్ ఇడ్లీ (3), సాంబార్, చట్నీ/పొడి
- మంగళవారం మిల్లెట్ ఉప్మా, సాంబార్, మిక్స్ డ్ చట్నీ
- బుధవారం పొంగల్, సాంబార్, చట్నీ
- గురువారం ఇడ్లీ (3), సాంబార్, చట్నీ
- శుక్రవారం పొంగల్, సాంబార్, చట్నీ
- శనివారం పూరీ (3), ఆలూ కుర్మా