
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్ జోడీగా నటించిన ‘భైరవం’ చిత్రం నుంచి ‘గిచ్చమాకు గిచ్చమాకు.. గుచ్చమాకు గుచ్చమాకులే..’ అంటూ సాగిన ఫోక్ సాంగ్‌ను శుక్రవారం విడుదల చేశారు. శ్రీచరణ్ పాకాల కంపోజ్ చేసిన పాటకు కాసర్ల శ్యామ్ క్యాచీ లిరిక్స్ అందించగా, ధనుంజయ్ సీపాన, సౌజన్య భాగవతుల కలిసి పాడిన తీరు ఆకట్టుకుంది.
‘నాజూకు పటాకువే.. నీ నడుము చటాకులే.. నీ గాజుల్లో పిలుపు.. యేసైమందే తలుపు.. తినిపిస్తాలే పులుపు.. పదవే మూడు నెల్లకే..’ అంటూ సాగిన ఫోక్ సాంగ్‌లో సాయి శ్రీనివాస్, అదితి ట్రెడిషినల్ వేర్‌లో సింపుల్ డ్యాన్స్ మూమెంట్స్‌తో ఇంప్రెస్ చేశారు.
సాయి శ్రీనివాస్‌తో పాటు మంచు మనోజ్, నారా రోహిత్ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ చిత్రాన్ని విజయ్ కనకమేడల రూపొందించాడు. అదితితో పాటు ఆనంది, దివ్యా పిళ్లై హీరోయిన్స్‌గా నటించారు. కెకె రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.