
మనది ధనిక రాష్ట్రం కాబట్టి వచ్చే అతిథులకు మంచి మర్యాదలు చేయాలె కదా. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్ రోజున ఏపీ, మహారాష్ట్ర సీఎంలు, ఇతర అతిథులకు సుమారు కోటిన్నర రూపాయలకు పైగా విలువైన సిల్వర్ ఫిలిగ్రీ మెమొంటోలు అందజేశారు. కార్యక్రమానికి హాజరైన అతిథులకు మెమొంటోలు ఇచ్చేందుకు 180 కిలోల వెండితో తయారు చేసిన కరీంనగర్ ఫిలిగ్రీ ఐటమ్స్‌కు రూ. 1,66, 86,000 ఖర్చు చేశారు. వీటి కొనుగోలు ఖర్చులో 50 శాతం మొత్తం 83.43లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే కాదు దాని ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులకు కూడా భారీ బహుమతులే ఇచ్చారని సర్వత్రా చర్చించుకుంటున్నారు.