మణికొండ గ్రామంలో ఆపరేటర్ కరెంట్ సప్లై ఇస్తలేడని రైతుల ధర్నా

మణికొండ గ్రామంలో ఆపరేటర్ కరెంట్ సప్లై ఇస్తలేడని రైతుల ధర్నా
  • మణికొండ సబ్ స్టేషన్ ఎదుట రైతుల నిరసన

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: మణికొండ గ్రామంలోని సబ్ స్టేషన్ ఆపరేటర్ మూడు నెలలుగా త్రీఫేజ్ కరెంట్ సప్లై సమయానికి ఇవ్వడం లేదని ఆరోపిస్తూ సబ్ స్టేషన్ ఎదుట శుక్రవారం రైతులు ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఏడీ మద్దిలేటి, ఏఈ నరసింహా రెడ్డి రైతులతో మాట్లాడారు. ఆపరేటర్ మద్యం సేవించి విధులకు వస్తున్నాడని, కరెంట్ సప్లై చేయడం లేదని ఆరోపించారు. ఫోన్ చేస్తే నంబర్ లు బ్లాక్ లిస్టులో పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంట్ సప్లైచేయాలని అడిగితే దురుసుగా మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు.

 ఆపరేటర్ ను సస్పెండ్ చేయాలని అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఏడీ మద్దిలేటి మాట్లాడుతూ.. సబ్ స్టేషన్ ఆపరేటర్ ను ఇక్కడి నుంచి ట్రాన్స్ ఫర్ చేస్తానని హామీ ఇచ్చారు. ధర్నాలో నాయకులు గంగన్న, రాజప్ప, వీరేశ్, శేఖర్,ఆంజనేయులు, రైతులు పాల్గొన్నారు.