
గద్వాల, వెలుగు: జిల్లాలోని గురుకులాలు, హాస్టల్స్ నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని, ఉండవల్లి ఘటన పునరావృతం కాకుండా చూడాలని కలెక్టర్ సంతోష్ ఆఫీసర్లకు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్స్ నిర్వహణపై ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి రివ్యూ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ .. హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్వహణపై ఎలాంటి తప్పిదాలు జరిగినా ఉపేక్షించేది లేదన్నారు.
తహసీల్దార్లు, ఎంపీడీవోలు తమ పరిధిలోని హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించాలన్నారు. అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరావు, ఆర్డీవో అలివేలు పాల్గొన్నారు.