2025 లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల మధ్య పోటీ జరుగుతుంది. ఈ ఏడాది టాప్ రన్ స్కోరర్ గా నిలిచేందుకు ప్రధానంగా ఇద్దరి మధ్యే పోటీ ఉంది. వారిలో ఒకరు టీమిండియా వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభమా గిల్ కాగా.. వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ షై హోప్. ఈ ఏడాది వీరిద్దరూ అంతర్జాతీయ క్రికెట్ లో పరుగుల వరద పారించారు. 2025 ముగియడానికి మరో 20 రోజుల సమయం ఉన్నందున వీరిద్దరిలో టాప్ రన్ స్కోరర్ ఎవరవుతారనే ఆసక్తి నెలకొంది. మూడు ఫార్మాట్ లలో నిలకడగా ఆడుతున్న గిల్, హోప్ ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్ లో ఎన్ని పరుగులు చేశారో ఇప్పుడు చూద్దాం..
వెస్టిండీస్ వికెట్ కీపర్ హోప్ ప్రస్తుతం టాప్ రన్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. 2025లో మూడు ఫార్మాట్ లలో కలిపి హోప్ ఆడిన 41 మ్యాచ్‌ల్లో 47 ఇన్నింగ్స్‌ల్లో 1749 పరుగులు సాధించాడు.15 వన్డేల్లో 670 పరుగులు, 7 టెస్టుల్లో 13 ఇన్నింగ్స్‌ల్లో 523 పరుగులు, 19 టీ20 మ్యాచ్‌ల్లో 556 పరుగులు హోప్ ఖాతాలో ఉన్నాయి. మరోవైపు గిల్ మూడు ఫార్మాట్ లవ్ కలిపి 33 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 40 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 1736 పరుగులు సాధించాడు. 1736 పరుగులు చేసి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. గిల్ తొమ్మిది టెస్టుల్లో 983 పరుగులు, 11 వన్డేల్లో 490 పరుగులు.. 13 టీ20 మ్యాచ్‌ల్లో 263 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు.
Also read:- అయ్యర్‌దే మొత్తం బాధ్యత.. వేలానికి పంజాబ్ కెప్టెన్..
హోప్, గిల్ మధ్య కేవలం 13 పరుగుల తేడా మాత్రమే ఉంది. ప్రస్తుతం హోప్ న్యూజిలాండ్ తో మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో ఆడుతున్నాడు. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 48 పరుగులు చేసిన ఏ విండీస్ వికెట్ కీపర్.. ఈ ఏడాది ఈ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ తో పాటు.. మూడో టెస్ట్ ఆడాల్సి ఉంది. మరోవైపు గిల్ సౌతాఫ్రికాతో మరో నాలుగు టీ20 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఇద్దరు దగ్గరగా ఉండడంతో ఈ ఏడాది టాప్ స్కోరర్ ఎవరు నిలుస్తారో ఆసక్తికరంగా మారింది. గురువారం (డిసెంబర్ 11) సౌతాఫ్రికాతో గిల్ రెండో టీ20 మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో 14 పరుగులు చేస్తే హోప్ ను వెనక్కి నెడతాడు.
హోప్, గిల్ తర్వాత 1585 పరుగులతో జింబాబ్వే క్రికెటర్ బ్రియాన్ బెన్నెట్ మూడో స్థానంలో ఉన్నాడు. అఘా సల్మాన్ (1569), జో రూట్ (1540) వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. టీమిండియా నుంచి కేఎల్ రాహుల్ 1180 పరుగులతో ఈ ఏ ఏడాది అత్యధిక పరుగులు చేసిన టాప్-10 క్రికెటర్ల లిస్ట్ లో ఉన్నాడు.
🚨 SHAI HOPE - LEADING RUN-GETTER IN INTERNATIONAL CRICKET IN 2025 🚨
— Johns. (@CricCrazyJohns) December 10, 2025
Shai Hope - 1749 runs. (47 Innings)
Shubman Gill - 1736 runs. (40 Innings) pic.twitter.com/NcDzYtc41q

