సౌతాఫ్రికాతో తొలి టీ20 విజయంతో జోరుమీదున్న ఇండియా.. రెండో టీ20లో దుమ్ములేపడానికి సిద్ధమైంది. గురువారం (డిసెంబర్ 11) రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. చండీగఢ్ వేదికగా ముల్లన్‌పూర్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. సొంతగడ్డ కావడం.. సూపర్ ఫామ్ లో ఉండడంతో ఈ మ్యాచ్ లో టీమిండియా ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. మరికాసేపట్లో జరిగే ఈ పోరులో మరోసారి ఆల్‌రౌండ్‌షో చూపెట్టాలని భావిస్తోంది. సాయంత్రం 7:00 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతోంది. స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్స్ లో లైవ్ టెలికాస్టింగ్.. జియో హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య ఒక అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు.
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కేవలం 28 బంతుల్లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 59 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పాండ్య అద్భుతమైన ఆటతో భారత జట్టు 101 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో నాలుగు సిక్సర్లు బాదిన పాండ్య అంతర్జాతీయ క్రికెట్ లో 100 సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు. రెండో టీ20కి ముందు మరో మైల్ స్టోన్ కు చేరువలో ఈ టీమిండియా ఆల్ రౌండర్ ఉన్నాడు. హార్దిక్ పాండ్య ప్రస్తుతం అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో 99 వికెట్లు పడగొట్టాడు. మరో వికెట్ తీసుకుంటే 100 వికెట్లు తీసుకున్న నాలుగో ప్లేయర్ గా నిలుస్తాడు.
అదే జరిగితే అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో 100 సిక్సర్లు, 100 వికెట్లు తీసిన నాలుగో ప్లేయర్ గా అరుదైన లిస్ట్ లో చేరతాడు. ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్ లో ఇప్పటివరకు 100 సిక్సర్లు, 100 వికెట్లు పడగొట్టిన ఘనత ముగ్గురికే ఉంది. జింబాబ్వే ఆల్ రౌండర్ సికందర్ రజా, ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ మహ్మద్ నబీతో పాటు మలేషియాకు చెందిన వీరన్‌దీప్ సింగ్‌లు ఈ లిస్ట్ లో ఉన్నారు. హార్దిక్ ఒక వికెట్ పడగొడితే ఈ ఆరుదిన లిస్ట్ లోకి ఎంట్రీ ఇస్తాడు. మరి హార్దిక్ పాండ్య నేడు జరిగే మ్యాచ్ లో ఈ జాబితాలో చేరతాడో లేదో చూడాలి.
ALSO READ : సింహాచలం ఆలయాన్ని దర్శించుకున్న విరాట్ కోహ్లీ..
అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో 100 సిక్సులు, 100 వికెట్లు తీసిన ఆటగాళ్ళు:
సికందర్ రజా (జింబాబ్వే)
మహ్మద్ నబీ (ఆఫ్ఘనిస్థాన్)
విరందీప్ సింగ్ (మలేషియా)

