V6 News

సింహాచలం ఆలయాన్ని దర్శించుకున్న విరాట్ కోహ్లీ.. భారత్ గెలుపు తర్వాత ప్రత్యేక పూజలు..

 సింహాచలం ఆలయాన్ని దర్శించుకున్న విరాట్ కోహ్లీ..  భారత్ గెలుపు తర్వాత ప్రత్యేక పూజలు..

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆదివారం విశాఖపట్నం సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతో పాటు ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్, భారత ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్,  ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) అధికారులు కూడా ఉన్నారు.

Also read:- ఏ ప్లస్ నుంచి ఏ కేటగిరికి పడిపోయిన కోహ్లీ, రోహిత్

సింహాచలం దేవస్థానం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎస్.రాధ, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె.తిరుమలేశ్వరరావు కోహ్లీ సహా అతని  బృందాన్ని ఆలయ మర్యాదలతో స్వాగతించారు. కోహ్లీ 'కప్ప స్థంభం' (పవిత్ర స్తంభం)ను ఆలింగనం చేసుకుని, దైవ దర్శనం చేసుకుని పూజలు చేశారు.

దర్శనం తర్వాత వేద పండితులు వేద మంత్రోచ్ఛారణలతో వేద ఆశీర్వచనం చేసారు. ఆలయం తరపున కోహ్లీకి స్వామి వారి శేష వస్త్రం, స్వామి వారి చిత్రపటం, ప్రసాదం అధికారులు అందజేశారు.

విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే ఇంటర్నేషనల్ (ODI) క్రికెట్ సిరీస్‌ భారత్ కైవసం చేసుకున్న ఒక రోజు తర్వాత ఈ పర్యటన జరిగింది. అంతకుముందు శనివారం గౌతమ్ గంభీర్ కూడా సింహాచలం ఆలయంలో సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.