V6 News

BCCI Central Contracts: బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌.. ఏ ప్లస్ నుంచి ఏ కేటగిరికి పడిపోయిన కోహ్లీ, రోహిత్

BCCI Central Contracts: బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌.. ఏ ప్లస్ నుంచి ఏ కేటగిరికి పడిపోయిన కోహ్లీ, రోహిత్

టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ లో ఏ కేటగిరికి పడిపోనున్నారు. డిసెంబర్ 22న జరిగే BCCI అపెక్స్ కౌన్సిల్ వార్షిక సర్వసభ్య సమావేశంలో సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ రిలీజ్ కానుంది. అక్టోబర్ 1, 2024 నుండి సెప్టెంబర్ 30, 2025 వరకు భారత క్రికెటర్ల ప్రదర్శన బట్టి కేతగిరీలు ఎంపిక చేయనున్నారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా కోహ్లీ, రోహిత్ ఏ ప్లస్ కేటగిరి నుంచి ఏ కేటగిరికి పడిపోనున్నట్టు సమాచారం. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. కోహ్లీ, రోహిత్ శర్మ ప్రస్తుతం ఒకే ఫార్మాట్ ఆడుతున్నారు.

ఏ ప్లస్ కేటగిరిలో స్థానం సంపాదించాలంటే టెస్ట్ క్రికెట్ ఖచ్చితంగా ఆడాలి. కానీ రోహిత్, విరాట్ మాత్రం వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నారు. దీంతో వీరికి డిమోషన్ తప్పేలా లేదు. చివరిసారిగా బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ లో కోహ్లీ, రోహిత్ ఏ ప్లస్ కేటగిరిలో ఉన్నారు. అప్పటికీ వీరిద్దరూ టెస్ట్ క్రికెట్ లో కొనసాగుతుండడంతో ఏ ప్లస్ కేటగిరిలో కొనసాగారు. ప్రస్తుతం వీరు వన్డే క్రికెట్ లో సూపర్ ఫామ్ లో ఉన్నా ఫలితం ఒకే ఫార్మాట్ ఆడడం వీరికి మైనస్ గా మారింది. టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత రోహిత్, కోహ్లీ ఇద్దరూ కూడా నెక్స్ట్ లెవల్ ఫామ్ లో ఉన్నారు. 

Also read:- సింహాచలం ఆలయాన్ని దర్శించుకున్న విరాట్ కోహ్లీ.. భారత్ గెలుపు తర్వాత ప్రత్యేక పూజలు..

ఆస్ట్రేలియా సిరీస్ లో రోహిత్ శర్మ టాప్ స్కోరర్ గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకుంటే.. ఇటీవలే సౌతాఫ్రికాతో జరిగిన మూడు వినడేలా సిరీస్ విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. ఏ ప్లస్ కేటగిరి విషయానికి వస్తే టీమిండియా టెస్ట్, వన్డే కెప్టెన్ శుభమాన్ గిల్ తొలిసారి ఏ ప్లస్ కేటగిరిలో చోటు సంపాదించనున్నాడు. ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా ఏ ప్లస్ కేటగిరిలో స్థానం దక్కనున్నట్టు సమాచారం.     

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుకు ఎంపికైన క్రికెటర్ల వార్షిత వేతనం విషయానికొస్తే.. ‘A+’ గ్రేడ్ క్రికెటర్లకు రూ.7 కోట్ల శాలరీ, గ్రేడ్ ‘A’ కు ఎంపికైన క్రికెటర్లకు 5 కోట్లు, గ్రేడ్ ‘B’ కి ఎంపికైన క్రికెటర్లకు 3 కోట్లు, గ్రేడ్ ‘C’ కి ఎంపికైన క్రికెటర్లకు కోటి రూపాయల వార్షిక వేతనం అందుతుంది. కాంట్రాక్టుకు అర్హత సాధించాలంటే ఒక సంవత్సరంలో కనీసం మూడు టెస్ట్ మ్యాచులు, 8 వన్డేలు, 10 టీ20 మ్యాచులు ఆడాల్సి ఉంటుంది.