బట్టలు ఆరేస్తుండగా కరెంట్​ షాక్ తో బాలిక మృతి

బట్టలు ఆరేస్తుండగా కరెంట్​ షాక్ తో బాలిక మృతి

నర్సింహులపేట, వెలుగు: బట్టలు ఆరేస్తుండగా కరెంట్​షాక్​తగిలి మహబూబాబాద్ జిల్లాలో తొమ్మిదో క్లాస్ స్టూడెంట్​మృతి చెందింది. పోలీసులు, తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింహులపేట మండలం లోక్యతండా అనుబంధ గ్రామమైన మూడవత్ తండాకు చెందిన మూడవత్ నవ్య(13) స్థానిక స్కూల్​లో తొమ్మిదో క్లాస్​చదువుతోంది. వారం రోజులుగా తండాకు కరెంట్​సప్లై సరిగా లేకపోవడంతోపాటు, ఎర్త్​అవుతుండడంతో గ్రామస్తులు రాత్రిళ్లు ట్రాన్స్​ఫార్మర్​ఆఫ్​చేస్తున్నారు. శనివారం రాత్రి కూడా బంద్​చేయగా ఆదివారం ఉదయాన్నే సర్పంచ్​భర్త వెంకన్న వచ్చి ఆన్​చేశాడు. కొద్దిసేపటి తర్వాత బాలిక నవ్య ఇంటి వద్ద బట్టలు ఆరేస్తుండగా కరెంట్ షాక్​తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. వారం నుంచి ట్రాన్స్​ఫార్మర్​బంద్​చేసినా కరెంట్​సప్లై అవుతోందని, లైన్ మన్ మంగిలాల్​కు చెప్పినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు.శనివారం రాత్రి బంద్​చేసిన కరెంట్​ సప్లైని సర్పంచ్ భర్త వెంకన్న ఆన్ చేయడంతోనే తమ బిడ్డ చనిపోయిందని మృతురాలి తండ్రి రవి పోలీసులకు కంప్లైంట్​ చేశాడు. అలాగే లైన్ మన్ మంగిలాల్​పై చర్యలు తీసుకోవాలని కోరాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.