నల్గొండ : ఇంటర్​ ఫలితాల్లో అమ్మాయిలే టాప్​

నల్గొండ : ఇంటర్​ ఫలితాల్లో అమ్మాయిలే టాప్​
  • అమ్మాయిలే టాప్​ 
  • ఇంటర్​లో గతేడాది కంటే పాస్​ పర్సంటేజ్​
  •  నల్గొండ, యాద్రాద్రిలో తగ్గుదల.. సూర్యాపేటలో స్వల్ప పెరుగుదల 

నల్గొండ/యాదాద్రి/సూర్యాపేట, వెలుగు :  ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇంటర్​ ఫలితాల్లో అమ్మాయిలే టాప్​గా నిలిచారు.  అయితే ఫలితాల్లో నల్గొండ, యాదాద్రి జిల్లాలు గతం కంటే వెనుకబడిపోయాయి. సూర్యాపేటలో మాత్రం పాస్ ​పర్సంటేజ్ స్వల్పంగా పెరిగింది. గతేడాది సెకండియర్​లో 6వ స్థానంలో నిలిచిన నల్లగొండ జిల్లా ప్రస్తుత ఫలితాల్లో 12వ స్థానానికి పడిపోయింది. గతేడాది 68 శాతం ఉత్తీర్ణత సాధించగా,  ఈసారి 64 శాతానికే పరిమితమైంది. ఫస్టియర్​ ఫలితాల్లో గతేడాది 6వ స్థానంలో ఉండగా ఈసారి 13వ స్థానానికి పడిపోయింది. అయితే గురుకులాల్లో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఎంపీసీ విభాగంలో నల్లగొండలోని గౌతమి కళాశాల 993 మార్కులు సాధించగా,  బైపీసీ విభాగంలో ప్రగతి జూనియర్‌‌ కళాశాల 990 మార్కులతో ముందు వరుసలో ఉంది. కాగా ఫలితాల్లో అమ్మాయిలే హవా కొనసాగింది. సెకండియర్​లో 33,062 మంది స్టూడెంట్స్​ఎగ్జామ్​ రాయగా 20,894 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్​లో 32, 437 మంది స్టూడెంట్ ఎగ్జామ్స్​ రాయగా 18,515 మంది ఉత్తీర్ణత సాధించారు. 

ఒకేషనల్‌‌ ఫస్టియర్​ లో 56 శాతం, సెంకడియర్​ లో 66 శాతంగా నమోదైంది. ఈ ఫలితాల్లో ఫస్టియర్​లో జనరల్‌‌ కేటగిరిలో బాలురు 5,929 మంది పరీక్షకు హాజరు కాగా 2,847 మంది ఉత్తీర్ణులై 48శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికల విభాగంలో 6,479 మంది పరీక్షకు హాజరు కాగా 3,842 ఉత్తీర్ణులై 60శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్​లో బాలురు 5, 907 మంది పరీక్షకు హాజరుకాగా 3,361 మంది పాస్‌‌ కావడంతో 56 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికల విభాగంలో 1,038 మంది పరీక్షకు హాజరు కాగా 830 పాసై 79శాతం ఉత్తీర్ణత సాధించారు.  నల్లగొండ ఉమ్మడి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో విద్యార్థులు ప్రతిభను కనబర్చారు. తెలంగాణ సోషల్‌‌ వెల్ఫేర్‌‌ రెసిడెన్సియల్‌‌ గురుకుల పాఠశాలలో మొదటి సంవత్సరంలో ఎంపీసీలో 75.37, బైపీసీలో 79.86, సీఈసీ 61.71, హెచ్‌‌ఈసీ 57.00 శాతం ఉత్తీర్ణత సాధించగా ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో 88.82, బైపీసీలో 92.49, సీఈసీలో 91.38, హెచ్‌‌ఈసీ 81.5 , ఎంఈసీలో 64.29 శాతం ఉత్తీర్ణత సాధించారు. - ఎస్టీ గురుకులాల్లో మొదటి సంవత్సరంలో 75.66 శాతం ఉత్తీర్ణత సాధించగా,  ద్వితీయ సంవత్సరంలో 88.13 శాతం సాధించారు. - బీసీ గురుకులాల్లో మొదటి సంవత్సరంలో 75.23 శాతం ఉత్తీర్ణత సాధించగా,  ద్వితీయ సంవత్సరంలో 87.56 శాతం ఉత్తీర్ణత సాధించారు.

యాదాద్రిలో... 

యాదాద్రిలో జిల్లా గతేడాది 60.22 శాతం పర్సంటేజ్​ఉండగా ఈసారి 57 శాతానికి తగ్గింది. జిల్లా ఏర్పడినప్పటి నుంచి చూస్తే ప్రతి సంవత్సరం రిజల్ట్​ శాతం పెరుగుతూ రాగా ఈసారి తగ్గిపోయింది. కాగా సర్వేల్​ రెసిడెన్షియల్​కాలేజీలో బైపీసీ చదువుతున్న తమ్మడి వెల్లువ ప్రభంజన్​రావు 963 మార్కులు సాధించాడు.  భువనగిరిలోని వైష్ణవి కాలేజీలో చదువుతున్న ఆయేషా బేగం ఎంపీసీలో 468 మార్కులు సాధించి స్టేట్​ ఫస్ట్​ ర్యాంక్​లో నిలిచింది. స్టేట్​ లెవల్​లో ఫస్టియర్​ రిజల్ట్​లో జిల్లా 19, సెకండియర్​లో 22వ స్థానంలో నిలిచింది. ఇంటర్‌‌ ఫస్టియర్ 6, 207  మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్​ రాయగా 3, 725 (52 శాతం) మంది పాస్ అయ్యారు. రెండో సంవత్సరానికి సంబంధించి 6,440  మంది రాయగా 4,031 (63 శాతం) మంది స్టూడెంట్స్ పాస్ అయ్యారు. 

అయితే ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా బాలుర కంటే బాలికలే పై చేయి సాధించినా గతం కంటే ఈసారి తక్కువ శాతం పాసయ్యారు.  ఫస్టియర్​లో బాలురు 52 శాతం పాస్​ కాగా, బాలికలు 66 శాతం పాసయ్యారు. వొకేషనల్ ఫస్టియర్​లో బాలురు 44 శాతం పాస్​ కాగా, బాలికలు 59 శాతం పాసయ్యారు. సెకండియర్​లో బాలురు 55శాతం పాస్​ కాగా, బాలికలు 63 శాతం పాసయ్యారు. అయితే ఓరల్​గా గతేడాది 69.81 శాతం పాస్​కాగా ఈసారి 59 శాతానికి తగ్గింది. పలు ప్రభుత్వ కాలేజీల్లో పలువురు స్టూడెంట్స్ ప్రతిభ చూపారు. భూదాన్ పోచంపల్లి బాలికల కాలేజీలో కే సాయి కీర్తన 973(ఎంపీసీ), డీ భవాని 968(ఎంపీసీ), సర్వేల్ రెసిడెన్షియల్ కాలేజీలో చదువుతున్న తమ్మడి వెల్లువ ప్రభంజన్​రావు 963 (బైపీసీ), యాదరిగిరి గుట్ట బాలికల కాలేజీలో ఆర్ అనురాధ 962(బైపీసీ) మార్కులు సాధించి టాప్​లో నిలిచారు.

సూర్యాపేట కొద్దిగా బెటర్.. 

సూర్యాపేట , వెలుగు: ఇంటర్​ ఫస్టియర్​ ఫలితాల్లో గతేడాది 51 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈసారి కూడా అంతే శాతం పాసయ్యారు. సెకండియర్​లో మాత్రం గతేడాది 56 శాతం పాస్​కాగా, ఈ సారి 59 శాతం మంది స్టూడెంట్స్​ఉత్తీర్ణులయ్యారు. ఈసారి జిల్లా వ్యాప్తంగా సెకండియర్​ లో 6,518 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయగా 3,333 మంది ఉత్తీర్ణత సాధించారు.59శాతం ఉత్తీర్ణత సాధించి  రాష్ట్రస్థాయిలో 16వ స్థానంలో సూర్యాపేట జిల్లా నిలిచింది. ఫస్టియర్​లో 6,345 మంది పరీక్షకు హాజరు కాగా 3,764 మంది ఉత్తీర్ణత సాధించి 51 శాతంతో రాష్ట్రస్థాయిలో  సూర్యాపేట జిల్లా 16వ స్థానం లో నిలిచింది. ఫలితాల్లో బాలికలదే పైచేయిగా ఉంది. ఫస్టియర్​లో బాలురు 44శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 56శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్​లో బాలికలు 67 శాతం ఉత్తీర్ణత సాధించగా  బాలురు 49 శాతం ఉత్తీర్ణత సాధించారు. 

ఒకేషనల్ ఫస్టియర్​లో 1,715  మంది పరీక్షలకు హాజరుకాగా,  743  మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్​లో మొత్తం 1,319 మంది విద్యార్థులకు గాను 717  మంది ఉత్తీర్ణులయ్యారు. ఇదిలా ఉండగా  జిల్లాలోని పలు ప్రభుత్వ కాలేజీల స్టూడెంట్ష్​ సత్తా చాటారు. హుజూర్ నగర్ ప్రభుత్వ కాలేజీ లో ఫస్టియర్​ ఎంపీసీ లో పోకల చైతన్య 461, రెండవ సంవత్సరం ఎంపీసీ లో కంజివరం సురేందర్ కుమార్ వత్సల వైష్ణవి దేవి 991, హెచ్ ఈసీ లో గోసవేటి లక్ష్మీ  967 మార్కుల తో ప్రతిభ కనబర్చారు.   బైపీసీ ఇంగ్లీష్ మీడియంలో కొమ్ము ప్రశాంతి 979, ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం లో కర్నాటి స్వాతి 923,  ఒకేషనల్ ఎల్ ఎండీటీ లో బొడ్డు నిఖిల్ 956 మార్కులు సాధించారు. ప్రథమ సంవత్సరం ఫలితాలలో సీఈసీ ఇంగ్లీష్ మీడియంలో కే వినయ్ 462,   హెచ్ ఈ సీలో సీహెచ్ తేజస్వి 460, ఒకేషనల్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ లో ఎన్. శంకరాచారి 485 మార్కులతో ఉత్తీర్ణత సాధించి టాపర్లుగా నిలిచారు.